తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ తాజాగా మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  వివాదాస్పద వ్యాఖ్యాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘కడప రెట్ల నిజాల’ వెంట పడ్డారు.  ఆ మద్య ఎన్టీఆర్ లక్ష్మీస్ అంటూ తెగ హల్ చల్ చేసిన రాంగోపాల్ వర్మ సైలెంట్ గా ‘కడప రెట్ల నిజాల’ ను బయటకు తీసుకు వస్తున్నారు. 

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలపై వెబ్ సిరీస్ లను తీసుకొస్తానని ప్రకటించిన ఈ దర్శకుడు ‘కడప వెబ్ సిరీస్ ట్రైలర్ సీజన్ 1’ పేరుతో తాజా ట్రైలర్ ను యూట్యూబుల్ లో పెట్టేసి దాని తాలూకూ లింక్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.   ఇక ట్రైలర్ చూస్తుంటే..నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా..? అని ఒళ్లు ఝలదరించే విధంగా చూపించారు. 

అంతే కాదు అక్కడక్కడా కొన్ని బూతు సీన్లు, బూతు మాటలు కూడా యాడ్ చేశారు.   ఈ ట్రైలర్ లో వర్మ సంచలన కొటేషన్స్ కూడా కోట్ చేశారు. ఫ్యాక్షన్ రాయలసీమ ప్రజల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసిందీ వర్మ తన వ్యాఖ్యానం రూపంలో వినిపించారు.  ఈ సినిమాలో లో కొటేషన్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. 


రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులోనుంచే కత్తి పట్టుకుని పుడతారు
- అక్కడి వాళ్ల నమ్మకం 
కన్నుకి కన్ను సమాధానం కాని సమాధానం.
- రాజశేఖర్ రెడ్డి 
పగలేని బతుకు బతుకే కాదు
- బాంబుల శివారెడ్డి
ఈ తరహా కొటేషన్లు డిస్ ప్లే చేస్తూ... గొడ్డళ్లతో నరికే సీన్లతో ట్రైలర్ విడుదల చేసి వర్మ తన మార్కు మారదని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: