టాలీవుడ్ లోకి ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో  ‘కంచె’తో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Image result for varun tej tholi prema
ప్రస్తుతం వరుణ్ తేజ్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలి ప్రేమ' సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఇక ఘాజీతో తొలిసారి ‘వార్‌ ఎట్‌ సీ ఫిలిం’ అంటూ  తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్‌ రెడ్డి మరోసారి ఆడియన్స్‌ను అబ్బురపరచటానికి సిద్ధమయ్యారు. 
Image result for ghazi movie telugu
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టుగా తెలుస్తోంది.వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘తొలి ప్రేమ’ రిలీజ్‌ తర్వాత మార్చ్‌ లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం’’ అని కొన్ని వివరాలు చెప్పారు. ఇందులో వరుణ్‌ వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌)గా కనిపిస్తారట. అవునా.. అంటే ‘అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌’ అన్నారు సంకల్ప్‌ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: