ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో కూడుకున్న సినిమాలు బాగానే వస్తున్నాయి.  కథలో కొత్తదనం ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలైనా ఆదరిస్తారని..చిన్న సినిమాలైనా సరే మంచి విజయాలు అందుకుంటాయని పలు మార్లు రుజువు చేశారు.  తాజాగారామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం'ఉందా..లేదా?'. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది.   

Related image

ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో విభిన్నమైన కథ, స్క్రీన ప్లే తో  రూపొందించామని చిత్ర యూనిట్  తెలిపింది. అన్నట్టుగానే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ సంపాదించారు. ఈ వారం సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ద్వారా రామకృష్ణ, అంకిత హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.  ఇండస్ట్రీకి కొత్త అయినా పర్ఫార్మెన్స్ పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకున్నారు.  ఈ రోజుల్లో ఫేం సాయి కుమార్ పంపాన హీరో ఫ్రెండ్ పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ జగన్, ప్రొఫెసర్ పాత్రలో జీవా, హోం మినిస్టర్ పాత్రలో ఝాన్సీ వారి వారి పాత్రలకు తగిన విధంగా నటించారు.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

హారర్ సినిమాలకు ప్రధాన బలం బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. శ్రీమురళీ కార్తికేయ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమా ఫస్టాఫ్ కొన్ని కామెడీ సీన్లు, లవ్ సీన్లు, రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్‌లో జరిగే ఆత్మహత్య సంఘటనలతో సాగుతుంది. ఇక సెకండ్ ఆఫ్ లో   దెయ్యం నిజంగానే ఉందా? లేదా? అనే అన్వేషణతో రన్ అవుతుంది.  జీవా ప్రొఫెసర్ గా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. సౌండ్ గురించి తాను చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ప్రభావతి కూడా ఎవ్వరూహించని పాత్రలో మెప్పించింది. 

 ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్స్

కొన్ని సీన్లు ఆద్యంతం ఉత్కంఠత కొలిపే విధంగా తీర్చి దిద్దారు దర్శకులు.  తన ప్రియురాలు నందిని కాపాడేందుకు హీరో(రామకృష్ణ) రంగంలోకి దిగుతాడు. మరి అతడు ఏం చేశాడు? నిజంగానే ఈ హాస్టల్‌లో దెయ్యం ‘ఉందా... లేదా?' సినిమాల చాలా అద్భుతంగా చూపించాడు.   సౌండ్ పొల్యూషన్, పారా నార్మల్ యాక్టివిటీ, బై పోలార్ డిజార్డర్, సౌండ్ హిప్నాటిజమ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది.

 నటీనటులు

ఈ విషయాల గురించి దర్శకుడు బాగా రీసెర్చ్ చేసినట్టున్నాడు. ప్రతీ చిన్న విషయాన్ని చాలా క్లారిటీ గా గ్రాఫిక్స్ రూపంలో చూపించాడు. దీంతో కథ మీద ఇంట్రస్ట్ పెరిగింది. అసలు నిజాలు తెలిసే వరకు కథలో అనేక మలుపులు ఉన్నాయి. దర్శకుడి తొలి సినిమానే అయినప్పటికీ... చిన్న చిన్న పొరపాట్లున్నప్పటికీ... చాలా వరకు సక్సెస్ సాధించాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: