ఒక డబ్బింగ్ సినిమా అందులోనూ ఈమధ్య వరస పరాజయాలతో సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య నటించిన సినిమాకు సంబంధించిన టీజర్ రికార్డులు పవన్ మహేష్ జూనియర్ లకు షాకింగ్ గా మారింది. హీరో సూర్య ఇప్పటివరకు జూనియర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసాడు.

 

తెలుగులో ఇప్పటిదాకా 24 గంటల్లో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టీజర్‌ రికార్డును సూర్య కొత్తసినిమా ‘గ్యాంగ్’ సొంతం చేసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం లాంచ్ అయిన ఈటీజర్ 24 గంటల వ్యవధిలో 2.03 లక్షల లైక్స్ తెచ్చుకుంది. దీనికి 24 గంటల్లో 10 లక్షల వ్యూస్ రాగా లైక్స్ ఏకంగా 2 లక్షల మార్కును దాటడం సంచలనంగా మారింది. దీనితో ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా టీజర్‌ కూ 24 గంటల్లో ఇన్ని లైక్స్ రాలేదని సోషల్ మీడియాలో సూర్య అభిమానులు హడావిడి చేస్తూ పవన్ మహేష్ జూనియర్ ల అభిమానులకు చుక్కలు చూపెడుతున్నారు.


 ఇప్పటిదాకా ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ టీజర్ 24 గంటల్లో 1.92 లైక్స్ తెచ్చుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ 24 గంటల్లో 1.9 లక్షల లైక్స్‌తో తర్వాతి స్థానంలో ఉంది. ఇక పవన్ పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ ఒక్క రోజులోనే  1.46 లక్షల లైక్స్‌‌ తో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే రికార్డులు అన్నింటిని ఇప్పుడు హీరో సూర్య బ్రేక్ చేయడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.


 వాస్తవానికి హీరో సూర్యాకు తెలుగులో చాలామంది అభిమానులు ఉన్నప్పటికీ ఈమధ్య కాలంలో అతడి సినిమాలు వరసపెట్టి పరాజాయం సాధిస్తున్న నేపధ్యంలో టాలీవుడ్ లో సూర్య మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో ‘గ్యాంగ్’ టీజర్ కు ఈవిధంగా రెస్పాన్స్ రావడం ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మారింది. రాబోతున్న సంక్రాంతికి విడుదలవుతున్న ‘అజ్ఞాతవాసి’ ‘జై సింహా’ మూవీలతో పోటీగా ఈ ‘గ్యాంగ్’ విడుదల అవ్వడం ఒక ఆశ్చర్యం అయితే ఈ మూవీ టీజర్ కు ప్రస్తుతం వచ్చిన స్పందన మరింత ఆశ్చర్యకరంగా మారింది.. 



 


మరింత సమాచారం తెలుసుకోండి: