పవన్ ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ ఇంకా జరగకుండానే తన అభిమానుల ఆశల పై పవన్ నీళ్ళు జల్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీ ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరుగబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారీగా తన అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలకు గట్టిసూచనలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో పవన్ సినిమాల ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ అతికొద్ది మందిని మాత్రమే పిలవాలని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

బయట వ్యక్తులను పిలువొద్దు 

ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులతోపాటు అభిమానులను కూడ భారీ సంఖ్యలో కాకుండా కొద్ది సంఖ్యలో మాత్రమే పిలవాలి అని పవన్ కళ్యాణ్ సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆడియో ఆవిష్కరణ జరిగే సభా వేదిక సీటింగ్ కెపాసిటీ మించి ఆహ్వానాలు పంపవద్దని పరిమిత సంఖ్యలోనే ఇన్విటేషన్ కార్డులను ముద్రించాలిని గట్టి సూచనలు చేసినట్లు టాక్.

ఫ్యాన్స్‌కు మాత్రమే ఆహ్వానం

 అంతేకాదు ఈమూవీతో సంబంధం లేని వారిని బయట వ్యక్తులను ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు పిలువ వద్దు అని అంటూ ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు, ఫ్యాన్స్ మధ్యనే ‘అజ్ఞాతవాసి’ ఫంక్షన్ నిరాడంబరంగా జరగాలి అని పవన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈ ఫంక్షన్‌ కు చిరంజీవి రావడంలేదని లీకులు ఇమ్మని పవన్ సూచించినట్లు కూడ తెలుస్తోంది.

 కొంతమందినే పిలుద్దాం

 అంతేకాదు వ్యక్తిగత కారణాలు ముందస్తు అపాయింట్‌మెంట్ కారణాల వల్లనే చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు  సమాచారం కూడ మెగా అభిమానులకు చేరవేయమని పవన్ గట్టి సూచనలే చేసాడని టాక్. ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ ను ఒక ప్రముఖ ఛానల్ 90 లక్షల భారీ మొత్తానికి కొనుక్కున్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో అసంఖ్యాకంగా ఉన్న పవన్ అభిమానులు ‘అజ్ఞాతవాసి’ ఫంక్షన్ ను ప్రత్యక్షంగా కాకుండా కేవలం బుల్లితెరపైనే చూసి సరిపెట్టుకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అనుకోవాలి..   






మరింత సమాచారం తెలుసుకోండి: