టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచ్లర్ అయిన ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త  షికార్లు కొడుతుంటాయి.. డార్లింగ్ పెళ్లి  గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త పుట్టుకొస్తుంటుంది ..  ఆ మధ్య  ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ, వార్త సంచలనం కలిగించింది.. ఆ వార్తను అటు ప్రభాస్ ఫ్యామిలీ ఇటు అనుష్క కొట్టిపారేసిన విషయం తెల్సిందే.

దాన్ని తర్వాత భీమవరం ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనే వార్త హల్ చల్ చేసింది. అయితే  దీనిలో కూడా ఎంత మాత్రం నిజం లేదని వార్తను  కొట్టిపారేసారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి పై సంచలన కరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మెగాస్టార్ ఇంటి పేరైన కొణిదెల వారి ఇంటి అమ్మాయిని  ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త సంచలనం రేపుతోంది.

అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ రెబల్ స్టార్  కృష్ణంరాజు ఇద్దరూ మొగల్తూరుకు చెందినవారు, ఈ క్రమంలో చిరంజీవి సమీప బంధువుల అమ్మాయి ని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో ఈ వార్త వినపడుతుంది... ఇదే గనుక నిజమైతే అటు మెగా అభిమానులకు ఇక ప్రభాస్ అభిమానులకు ఇది మరొక పండగే అని చెప్పుకోవాలి.

మరొక పక్క మీడియా లో ఆ అమ్మాయి నాగబాబు కూతురు కొణిదెల నిహారిక అంటూ ఎవరో పుకారు పుట్టించారు దాంతో ఇంటర్నెట్ మొత్తం యూట్యూబ్ వీడియో ల నిండా వీరిద్దరి పెళ్లి అంటూ వీడియో ఎడిటింగ్ లు చేసి జనం మీదకి వదిలేస్తున్నారు పని లేని యూ ట్యూబర్ లు. మినిమం నాలెడ్జ్ లేకుండా ఏదో ఒక పుకరుని నమ్మి అందరూ ఇలా జర్నలిజం పరువు తీస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: