ఎప్పుడూ లేనివిధంగా ఈసారి క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ ఇద్దరు తెలుగు హీరోలు తమతమ సినిమాలతో పోటీ పడుతూ ఈవింటర్ రేస్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా వరస విజయాలతో దూసుకుపోతూ డబల్ హ్యాట్రిక్ అందుకున్న నాని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో పోటీ పడుతున్న నేపద్యంలో ఈక్రిస్మస్ వార్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నాని ‘ఎంసిఏ’ వచ్చే వారం 21న థియేటర్లలోకి వస్తూ ఉంటే ఆవెంటనే మరుసటి రోజున 22న అఖిల్ ‘హలో’ మూవీ వస్తోంది.


 దీనితో ఈరెండు సినిమాల మధ్య పోటీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే ఈరెండు సినిమాలు తమతమ స్థాయిలో భారీ సంఖ్యలో ధియేటర్స్ బుక్ చేసుకుని భారీ ఓపెనింగ్స్ పై కన్ను వేసాయి. ఈపరిస్థుతులలో ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. నాని సినిమాలకు సంబంధించి అదేవిధంగా అఖిల్ సినిమాలకు సంబంధించి మల్టీప్లెక్స్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది.


 దీనితో ఈ రెండు సినిమాలకు మల్టీప్లెక్సులకు సంబంధించిన పట్టణాలలో మంచి కలక్షన్స్ వస్తాయి అన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బాగా ఉన్న హైదరాబాద్ విశాఖపట్టణం విజయవాడ లాంటి పట్టణాలలో నానీ అఖిల్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి పట్టణాలలోని ప్రేక్షకులు తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాలను కూడ బాగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్ని మల్టీప్లెక్సులు సల్మాన్ సినిమాకు కూడా ప్రాధాన్యం ఇస్తాయి.


 అంతేకాదు ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు కూడ సల్మాన్ సినిమాలను బాగా చూస్తారు. ఇలాంటి పరిస్థుతులలో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ ఇదే క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల కావడం ‘హలో’ ‘ఎం సి ఎ’ సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ కు దెబ్బ పడుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు సల్మాన్ కత్రిన జంటకు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో ‘హలో’ ‘ఎంసిఎ’ సినిమాలలో ఏ సినిమాకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమాకు దెబ్బపడే ఆస్కారం ఉందని టాలీవుడ్ విశ్లేషకుల భావన.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: