కమెడియన్ విజయ్ కేసు మరో మలువు తిరిగింది. కేసులో వనిత విడుదల చేసిన ఫొటోస్ సంచలనానికి దారితీసింది. ఇప్పటికే ఆమె కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపిన పోలీసులు, తాజా ఫొటోస్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు.. కమెడియన్ విజయ్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది.  విజయ్ మరో మహిళతో పెట్టుకున్న వివాహేత బందానికి సంబంధించిన ఫొటోస్ ని అతని భార్య బయట పెట్టింది. దీనితో ఈ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. విజయ్ కి అనేక మంది మహిళలతో సంబంధాలు ఉండేవని వనిత చేసిన ఆరోపణలకు బయట పడ్డ ఫొటోస్ జీవం పోసినట్లైంది.

 Image result for vijay suicide

విజయ్ సూసైడ్ చేసుకున్న తరువాత ఈ కేసులో మరణానికి ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో ఇన్వెస్టిగేషన్ కి కీలకంగా మారింది. ఈ కేసులో సెల్ఫీ ఆధారంగా విజయ్ భార్య వనిత, శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ విషయం తెలియగానే తన భర్తకు అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తున్నాడని వనిత ఆరోపించింది. అందుకే విజయ్ కి ఎయిడ్స్ ఉందని తెలియగానే కావాలని తనపై బురద చల్లాడని, విజయ్ ఆగడాలు తట్టుకోలేకనే తన కూతుర్ని తీసుకొని త్రీ ఇయర్స్ గా దూరం ఉన్నానని చెప్పింది. అయితే అప్పటి నుండి వనిత, శ్రీనివాస్, శశిధర్ కనిపించకుండా పోయారు. వారికి నోటీసులు అందించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించి చివరకు వారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు.

 Image result for vijay suicide

తాజాగా వనిత విజయ్ వివాహేతర సంబంధానికి చెందిన ఫొటోస్ బయట పెట్టడం సంచలనానికి దారి తీసింది. ఈ ఫొటోస్ సేకరించిన పోలీసులు ఖంగు తినే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేసు నుండి తప్పించుకోవడానికే వనిత ఇలాంటి ప్లాన్ చేసేందని విజయ్ తల్లిదండ్రులు కొట్టిపారేస్తున్నారు. ఫొటోస్ మార్ఫింగ్ చేసి తన కొడుకు ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోందని. ఇటీవల పోలీసులకు దొరికిన ఫోన్ ఆడియోలో వనిత తను ఎంత దిగజారానో ఇంకా ఎంత దిగజరుతానో చూడు అంటూ బెదిరించిన మాటలకు నిదర్శనం ఈ ఫొటోస్ అని అతని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ కేసు మరో మలుపు తిరిగి పోలీస్ లకు దిమ్మతిరిగి షాక్ ఇచ్చింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్న ఎడ్ ఎపిసోడ్ లో పోలీసుల సీన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: