టాలీవుడ్ నెంబర్ రేసులో పవన్, మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రాం చరణ్ ఇలా అందరు పోటీలో ఉన్నారు. అయితే ఎవరికి వారు తమ సినిమాలతో సత్తా చాటుతుండగా సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ప్రసుత్తం నెంబర్ స్థానంలో ట్విట్టర్ ఫాలోవర్స్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు.


5 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇక సౌత్ సిని పరిశ్రమలో ధనుష్ 6.39 మిలియన్ ఫాలోవర్స్ తో ధనుష్ ముందున్నాడు. తెలుగులో ఈ రేంజ్ ఫాలోయింగ్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరని చెప్పాలి. తెలుగు తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత 5.71 మిలియన్ ఫాలోవర్స్ తో ముందుంది.


ఇక మిగతా స్టార్స్ విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 మిలియన్ మార్క్ దాటగా.. సూపర్ స్టార్ రజినికాంత్, త్రిషలు 4.4 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది రానా దగ్గుబాటి అత్యధికంగా 4.48 మిలియన్ ఫాలోవర్స్ తో ముందున్నాడు. అక్కినేని నాగార్జున ఫాలోవర్స్ కూడా 4.52 మిలియన్ కు చేరుకోవడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి ఖాతాలో 3.75 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. తమిళ హీరో సూర్యకు 3.46 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నాడు.


సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం కొరటాల శివ భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు. శ్రీమంతుడు తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: