టాలీవుడ్ లో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకులు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.  రాయలసీమను ‘ఫ్యాక‌్షన్‌’ ప్రాంతంగా చిత్రీకరిస్తూ ‘కడప’టైటిల్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం రాయలసీమ లో ఫ్యాక్షన్ పూర్తిగా మరిచిపోయి ప్రజలు ప్రశాంత జీవితం గడుపుతున్న సమయంలో వర్మ ‘కడప’ ట్రైలర్ లో దారుణంగా చూపించాడని రామ్‌గోపాల్‌ వర్మను అరెస్ట్‌ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు.
Image result for kadapa trailer
అనంతరం ఆర్ట్స్‌ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  ‘కడప’ ట్రైలర్ లో రక్త సిక్తంగా చూపించడమే కాకుండా అశ్లీలాన్ని కూడా చూపించి రాయలసీమపై చెడు అభిప్రాయం వచ్చేలా చూపించాడని రాయలసీమ విమోచన సమితి కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘కడప’ వెబ్‌ సిరీస్‌ను వదిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Image result for kadapa trailer
‘ఫ్యాక‌్షన్‌’ ఉన్నట్లు చూపడం ద్వారా రాయలసీమకు పెట్టుబడులు ఆగి అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మపై కోర్టులో పిల్‌ కూడా వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు భార్గవ, భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: