దర్శక ధీరుడు రాజమౌళి గురించి అతని సినిమాల సక్సెస్ గురించి కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేశాడు. బాహుబలి సినిమాతో ఇండియన్ క్రేజీ డైరక్టర్స్ లిస్ట్ లో చేరిన రాజమౌళి తనకు నచ్చిన ఓ సినిమాను 100 సార్లకు పైగా చూశానని చెబుతున్నాడు. ఇంతకీ జక్కన్నకు అంతగా నచ్చిన సినిమా ఏది అంటే హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్ అట.


మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో యాక్షన్, ఎమోషనల్ రెండిటికి రాజమౌళి లాక్ అయ్యాడట. దాదాపు 100 సార్లు పైనే చూశాడట. అయితే ఆ సినిమా స్పూర్తితోనే రాం చరణ్, ఎన్.టి.ఆర్ లతో తీసే సినిమా ఉంటుందని అంటున్నారు కొందరు. ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం, ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలతో బిజీగా ఉన్నారు.


అయితే ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకుని 2018 అక్టోబర్ నుండి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మెగా నందమూరి మల్టీస్టారర్ తో బాహుబలికి మించిన బజ్ ఏర్పడేలా చేశాడు రాజమౌళి. కచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటే మరోసారి రికార్డులన్ని తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు. 


స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో చరణ్, తారక్ లు ఇద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుందట. తప్పకుండా ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త రికార్డ్ సృష్టిస్తుందని మెగా నందమూరి అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: