టాలీవుడ్ లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన  ‘జర్నీ’ తెలుగు,తమిళంలో మంచి విజయం సాధించింది.  ఈ సినిమాలో అంజలి, జై జంటగా నటించారు.  ఆ తర్వాత అంజలి మంచి అవకాశాలతో తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించింది.  ఇక జై మాత్రం అనుకున్నంతగా రాణించలేక పోయాడు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘బెలూన్’ చింత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఆ మద్య అంజలి, జై మద్య ప్రేమాయణం సాగుతుందని...వీరి సహజీవనం కూడా చేస్తున్నట్లు..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 
Image result for anjali jai
దానికి తోడు అంజలి, జై ఇద్దరు వీటిని ఖండించకపోవడంతో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చినట్లైంది. అయితే తాజాగా వారి బంధంపై స్పందించింది అంజలి.  మేమిద్దరం ‘జర్నీ’ చిత్రం నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని..తనకున్న మంచి స్నేహితులలో జై ఒకడని ఈ సందర్భంగా తెలిపింది.
Image result for anjali jai dosa
అలాగే 'దోసె ఛాలెంజ్‌' గురించి కూడా చెప్పిన అంజలి.. దోసె వేసి ఇవ్వడానికి ప్రియుడే అయ్యుండాలా? అంటూ ప్రశ్నించింది. అంజలి, జై ప్రధాన పాత్రలో నటించిన 'బెలూన్' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తెలుగు హీరో రాజ్ తరుణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Image result for anjali jai dosa


మరింత సమాచారం తెలుసుకోండి: