దక్షణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి అలవాట్లూ సాంప్రదాయాలు ఇలా అనేక విషయాలలో తేడాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ సినిమాల నిర్మాణ పద్దతికీ టాలీవుడ్ సినిమాల నిర్మాణ పద్దతికీ చాల వ్యత్యాసం ఉన్నది. అక్కడ ఒక సినిమా మొదలైనప్పుడు ఆ సినిమా ఇంచుమించు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ముందుగానే ప్రకటిస్తారు. ఏవో అనివార్య పరిస్థుతులలో తప్ప ఖచ్చితంగా అదే డేట్ కు ఆ సినిమాలు విడుదల అయిపోతు ఉంటాయి. దానికి తగ్గట్టు గానే ఆ సినిమా ప్రచారాన్ని వారు చాలా ప్లాండ్ గా చేసుకుంటూ ఉంటారు. ఈ పద్దతికి పూర్తి విరుద్దం మన తెలుగు సినిమాలు. ఎంత పెద్ద సినిమా అయినా ప్రకటించిన విడుదల తేదీకి మన టాలీవుడ్ లో విడుదల అవ్వడం ఎప్పుడో కానీ జరగదు.

 ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘జంజీర్’ కు దర్శకత్వం వహిస్తున్న అపూర్వ లాఖ్య ఈ సినిమా పబ్లిసిటీ పై ద్రుష్టి పెట్టి తన పద్దతిలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. కానీ రామ్ చరణ్ అభిమానులకు అపూర్వ లాఖ్య చేస్తున్న ప్రమోషన్ నచ్చక అతడి ఫేస్ బుక్ లో ఈ దర్శకుడిని కామెంట్ చేస్తూ చెర్రీ అభిమానులు పెడుతున్న కామెంట్స్, ట్విటర్ లకు అపూర్వ లాఖ్యకు విపరీతమైన కోపం వచ్చి ఈ విషయం చెర్రీ దృష్టికి తీసుకు వెళ్ళడమే కాకుండా అటువంటి కామెంట్లను తన పై పెట్ట వద్దని చెర్రీ అభిమానులకు సూచించడమే కాకుండా ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్న తనకు రామ్ చరణ్ అభిమానుల దగ్గర సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయం పై పాఠాలు నేర్చుకోవలసిన పని లేదని అంటున్నాడట.

ఈ విధంగా చెర్రీ అభిమానులు ప్రవర్తించడానికి కారణం వచ్చె నెలలో విడుదల కాబోతున్న చెర్రీ ‘జంజీర్’ సినిమా పబ్లిసిటీ ఇంతకు వచ్చి జాతీయ మీడియాలో తప్ప ప్రాంతీయ మీడియాలో కనిపించక పోవడంతో రామ్ చరణ్ అభిమానులు విసుకు చెంది అపూర్వ లాఖ్యాని టార్గెట్ చేస్తున్నారట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మన చెర్రీ మాత్రం అటు అపూర్వ లాఖ్యకు ఇటు తన అభిమానులకు మధ్య జరుగుతున్న ఈ సున్నితమైన యుద్దంలో నలిగి పోతున్నాడని టాక్. ఒకవైపు సమైఖ్యాంధ్ర సెగతో రామ్ చరణ్ ‘ఎవడు’ వేడెక్కి పోతుంటే మరొక వైపు ‘జంజీర్’ కు తన అభిమానుల రీత్యా మరొక సమస్య వచ్చిపడింది అనోకోవాలి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: