గౌర‌వం సినిమా స‌మ‌యంలో ప్రకాష్‌రాజ్‌కి చుక్కలు చూపించాడ‌ట అల్లు శిరీష్‌. పొర‌పాటున ఆ సినిమాని రీల్ కెమెరాతో తీసుంటే మాత్రం నా ఇళ్లు ఆస్తులు అమ్ముకొని రోడ్డుపైకి వెళ్లాల్సి వ‌చ్చేద‌ని త‌న స‌న్నిహితుల‌తో చెప్పాడ‌ట‌. అంటే ఓ స‌న్నివేశం తీయ‌డానికి అన్ని టేకులు తీసుకొనేవాడ‌ట శిరీష్‌. ఆ సినిమా విడుద‌లలో ఆల‌స్యం జ‌ర‌గ‌డానికి అదే కార‌ణం అంటున్నారు. ఎంతో ఓపిక‌తో ఎలాగోలా ఆసినిమాని బ‌య‌టికి తీసుకొచ్చారు. ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు.

ప్రస్తుతం త‌న న‌ట‌న‌ను వినియోగించుకొనే అవ‌కాశం మారుతికి ఇచ్చాడు అల్లు శిరీష్‌. వీళ్లిద్దరూ క‌లిసి కొత్త జంట పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. ఎంతైనా శిరీష్‌కి అనుభవం వ‌చ్చింటుంది క‌దా అనుకొన్నాడు మారుతి. కానీ శిరీష్ ఏమీ మార‌లేద‌ట‌. ఒక్క షాట్ చేయ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్నాడ‌ట‌. దీంతో మారుతికి తిక్కరేగి తొలి రోజే ప్యాక‌ప్ చెప్పి వెళ్లిపోయాడ‌ట‌.

అస‌లే రొమాన్స్ సినిమా ఫెయిల్ అయ్యి గంద‌ర‌గోళంలో ఉన్నాడు మారుతి. ఈ స‌మ‌యంలో శిరీష్ ఇలా ఇబ్బంది పెడ‌తే ఎలా త‌ట్టుకొంటాడు? అందుకే జంప్ జిలానీ అనేశాడు. అల్లు శిరీష్ కూడా సినిమా చేయాల‌నే ఆత్రుత‌ని ప్రద‌ర్శించ‌డం కంటే న‌ట‌న కూడా కూసింత నేర్చుకొంటే మంచిది. లేదంటే గౌర‌వం ఫ‌లిత‌మే పున‌రావృతం అవుతుంద‌ని ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: