బాలీవుడ్ సినిమా జనాలకు సహజీవనం కొత్త కాదు. అయితే టాలీవుడ్ కు అది కాస్త తక్కువ. పవన్ కళ్యాణ్ చాలా కాలం సహజీవనం చేసి, ఆపై పెళ్లి చేసుకున్నాడు. ఆ మధ్య ఏకంగా పెళ్లి, నిశ్చితార్థం అంటూ రూమర్లు వచ్చాయి ఓ జంట విషయంలో. ఇవన్నీ వుంటే, ఓ కొత్త టాలీవుడ్ జంట సహజీవనం ప్రారంభించిందని వినికిడి. తెలుగు, తమిళ సినిమాలను దున్నేసి, 'ముదరి'పోయిన ఓ హీరోయిన్, ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న 'కుర్ర' హీరో కలిసి సహజీవనం మొదలెట్టారన్న వార్తలు కృష్ణనగర్ లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ ఫ్లాట్లు వున్న అపార్టుమెంటు కాంప్లెక్సు నిర్మించింది కూడా సినిమా రంగంతో చాలా దగ్గర సంబంధాలున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యపారి కావడం ఇంకో విశేషం. ఇద్దరి ఫ్లాట్లు ఒక్క దగ్గరే వుండడం వల్ల ఇలా వదంతులు పుడుతున్నాయని కొందరంటే, కాదు ఇటీవలే సహజీవనం మొదలెట్టారని కొందరంటున్నారు. ఏమిటో 'మాయ'..తెలియాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: