పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ పరేషాన్ లో పడ్డారు, విభజన సెగ నా సినిమాపై ఉండదు, దానికే నాపవర్ చూపిస్థానంటూ తెగేసి చెప్పి తన అత్తారింటికి దారేది సినిమాను ఈనెల 7ననే విడుదల చేస్థున్నాను అన్నాడు, ఏమయిందో తెలియదు కాని కేవలం రెండురోజులు ముందుకు జరిపి ఆతేదిని ఈనెల 9కి చేసాడు. దీంతో కారణం తెలియక బుర్రబద్దలు చేసుకోవడం అభిమానుల, టాలీవుడ్ వర్గాల వంతయింది.

తాజాగా అత్తారింటికి దారేది సినిమాను ఈనెల 9కి కాకుండా ఈనెల14తేదీన విడుదల చేయాలని బావిస్థున్నాడట, ఇదే విషయమై దిల్ రాజుతో తెగ చర్చిస్థున్నట్టు సోమవారం టాలీవుడ్ లో వార్తలు వెలుబడ్డాయి. విభజన సెగతో కాదని రెండురోజులు వాయిదా వేస్థే అనుకున్నారు, మళ్లీ ఆరు రోజులపాటు వాయిదావేస్థున్నారంటే కూడా ఆభయం లేదనుకోవచ్చు.

అంటే ఈ సినిమా విషయంలో మరేదో ఇబ్బందులు తలెత్తాయని అవి ఏంటి అంటూ తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అంత పరేషాన్ పవణ్ కు ఏంటా అంటూ... చెవులు కొరుక్కుంటున్నారు. పరేషాన్ లో పడ్డాడా, లేక చెర్రీ ఎవడు పోస్టర్ల చించివేత, దానిని అడ్డుకుంటామని మెగా అభిమానులు చేసిన హెచ్చరికనా... అన్నది తెలియాలంటే పవన్ లేదా దిల్ రాజే చెప్పాలి, లేదా మళ్లీ వాయిదా దూరం పోతే మనమే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: