క‌థ ఎలాంటిదైనా కూడా కొత్త కొత్త లొకేష‌న్లలో సినిమా చిత్రీక‌రించాల‌ని చెబుతుంటాడు నాగార్జున‌. ప్రేక్షకుడికి కొత్తగా అనుభూతికి గుర‌వ్వాలంటే అలా చేయ‌డ‌మే మేల‌నేది నాగ్ అభిప్రాయం. ఇదివ‌ర‌కు ఆయ‌న న‌టించిన ర‌గ‌డ సినిమాకోసం అరుదైన లొకేష‌న్‌లో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లారు. అనుష్క, నాగార్జున్ మీదుగా అక్కడ ఓ పాట‌ను తెర‌కెక్కించారు.

ఇప్పుడు నాగ్ న‌టిస్తున్న భాయ్ పాట‌ల‌కోసం కూడా విదేశాల‌కు వెళ్లారు. స్లోవేనియాలో 700యేళ్ల చ‌రిత్ర క‌లిగిన ఓ బిల్డింగ్ ఉంది. భాయ్ సినిమాకోసం ఆ బిల్డింగ్‌లో నాగార్జున‌, రిచా గంగోపాద్యాయ‌ల‌పై ఓ పాట‌ని తెర‌కెక్కించారు. ఆ పాట చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నాడు ద‌ర్శకుడు వీర‌భ‌ద్రమ్ చౌద‌రి.

చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. సినిమాని ద‌స‌రాకిగానీ, లేదంటే వినాయ‌క చవితికిగానీ విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఓ మాఫియా నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. రిచా గంగోపాధ్యాయ ఓ డాక్టర్‌గా యాక్ట్ చేస్తోంది. వీరిద్దరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కుర్రకారును కిక్కెంచేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: