పవన్ ఈ పేరులో ఏ వైబ్రేషన్ ఉందో తెలియదు కానీ పవనిజం మాయలో ప్రస్తుత యువతరంలో చాలామంది యూత్ ఉన్నారన్నది వాస్తవం. పవనిజం సమాజ సేవకు తెలంగాణ ఆంధ్ర అనే హద్దులు లేవని నిరూపిస్తూ శ్రామికులతో మమేకమైపోతున్న పై ఫోటోలోని పవర్ స్టార్ ను చూస్తే అప్పుడే పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నాడ అని అనిపిస్తుంది.

అందుకేనేమో 8 కోట్ల ఆంధ్ర ప్రజలలో పవన్ పేరు తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పవన్ రాజకీయ పార్టీ పెడతారని కొందరు లేదు మరొక ప్రముఖ పార్టీలో పవన్ చేరబోతున్నాడని అంటూ మరికొందరు. వార్తలు వస్తున్న నేటి నేపధ్యంలో అసలు పవన్ మనస్సులో ఏముంది అన్నది ఎవరికీ తెలియదు.  

కానీ నేనున్నా మీతో అంటూ అని భావం వచ్చేలా ఈ శ్రామికజీవులతో ఏమి మాట్లాడుతున్నాడు అన్నది పవన్ కు మాత్రమే తెలుసు. అందుకే ‘పవన్ అంటే ఒక ఇజం – పవన్ అంటే ఒక చైతన్యం’...  

మరింత సమాచారం తెలుసుకోండి: