మ‌హేబాబు మూవీలో ఐటెం సాంగ్ చేయాల‌నే ఆతృత ప్రతి మోడ‌ల్‌కు ఉంటుంది. అలాగే బోల్డ్ హీరోయిన్స్ కూడ ప్రిన్స్‌తో స్టెప్స్ వేయ‌టానికి సై అంటారు. ఈ మ‌ధ్య కాలంలో చార్మి ఎక్కువుగా ఐటెం సాంగ్స్ చేస్తూ అన్ని మూవీల్లో సంద‌డి చేస్తుంది. అలాగే నెం.1 మూవీలో సైతం ఐటెం సాంగ్ చేయ‌టానికి కొంత మందితో మంత‌నాలు న‌డిపింది. కాక‌పోతే అవి అంత‌గా ఫ‌లించ‌లేదు. ప్రిన్స్ అప్‌క‌మింగ్ మూవీ నెం.1లో ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ ఎవ‌రో తెలిసింది. త‌నే మోడ‌ల్ కం యాక్ట్రెస్ సోఫి చౌద‌రి.

ఈ లండ‌న్ బేబి ఇండియన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో పాతుకుపోవ‌టానికి తెగ ప్రయ‌త్నాలు చేస్తుంది. అడ‌పాద‌డపా బాలీవుడ్ మూవీల్లో సంద‌డి చేస్తూ, కుదిరిన‌ప్పుడు ప్రవైట్ ఆల్బమ్స్ చేసుకంటుంది. ఆ విధంగానే హంగామ హో గ‌యా అనే ఆల్బమ్‌తో త‌నేంతో బాలీవుడ్‌కు చూపించింది. ఈ ఆల్బమ్ త‌రువాత షూట్ అవుట్ ఎట్ వ‌దాల మూవీలో కాపేపు త‌ళుక్కుమ‌ని క‌నిపించింది. నెం.1 మూవీలో క్రత్రినా ఐటెం సాంగ్ అంటూ వ‌చ్చిన ఊహాగానాలు అన్ని క‌ల్పిత‌మ‌నే తేలాయి. ఎంతో ఆశ‌గా చూసిన చార్మీకు నిరాశే మిగిలింది.

చివ‌రికి సోఫి వ‌ద్దకు ఈ ఐటెం ఆఫ‌ర్ ఎలా వెళ్ళిందో తెలియ‌దు కాని, ప్రిన్స్ స‌ర‌స‌న‌ ఐటెం ఆఫ‌ర్ కొట్టేసిందంటూ టాలీవుడ్ స‌మాచారం. ఈ సాంగ్‌ను మ‌హేష్ లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న త‌రువాత షూట్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ‌హేష్ కోసం ప్రత్యేకంగా ఓ డిప్రెంట్ ఐటెం సాంగ్‌ను కంపోజ్ చేశాడంట‌. అన్ని సాంగ్స్ కంటే ఈ ఐటెం సాంగే దుమ్మురేపుతుందంటున్నారు దేవిశ్రీప్రసాద్ టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: