2014 చివ‌రి వ‌ర‌కూ ఫుల్ బిజిగా ఉన్న సోనాక్షి, త‌న బ‌లుపు ఎంతో మీడియాకు చూపించింది. ఇప్పటి వ‌ర‌కూ సోనాక్షి నోటి నుండి చాలా సాప్ట్‌గా స‌మాధానాలు విన్న మీడియా, ఆ బ్యూటీ చెప్పిన బ‌లుపు మాట‌ల‌కు అంతా అవాక్కయ్యారు. సోనాక్షి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ మూవీ బుల్లెట్‌రాజా షూటింగ్ బిజిలో ఉన్నారు. అయితే రీసెంట్‌గా జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్‌కు అటెండ్ అయిన సోనాక్షిను మీడియా ప్రశ్నించింది. మీరు ఇంత వెయిట్‌గా మారారు, మొన్నటి వ‌ర‌కూ త‌క్కువ వెయిట్ ఉన్నారు క‌దా అని అడిగింద‌ట‌.

దీంతో ఒళ్ళు మండిన సోనాక్షి నా వెయిట్‌తో మీకేం ప‌ని, నేను నా బ‌రువు గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేదు, త‌గ్గద‌లుచుకోలేదు. చూస్తే చూడండి, లేకుంటే లేదు. అంటూ మీడియాపై చిర్రుబుర్రులాడింద‌ట‌. సోనాక్షి చెప్పిన ఆ స‌మాధానాన్ని మీడియా జీర్ణించుకోలేపోయింది. వెంట‌నే సోనాక్షి వెయిట్ కామెంట్స్ అంటూ ప‌తాక శీర్షిక‌ల్లోనూ, బ్రేకింగ్ న్యూస్‌ల్లోనూ పెట్టారంట‌.

కార‌ణం ఏంటంటే హిమ్మత్‌వాల మూవీలో ఐటెం సాంగ్ చేసిన సోనాక్షి ఆ స‌మయంలో చాలా వెయిట్ తగ్గింద‌ట‌. ఆ త‌రువాత డైట్ కంట్రోల్ చేసుకోలేక మ‌ళ్ళీ ఒళ్ళు చేసింద‌ట‌. దీనికి సంబంధించిన కొన్ని సీన్లు సోనాక్షి అప్‌క‌మింగ్ మూవీ ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్‌లో స్పష్టంగా చూడొచ్చు అంటున్నారు బాలీవుడ్‌. అందుకే ప్రతి ఒక్కరూ సోనాక్షి వెయిట్ గురించి అడ‌గ‌టంతో ఈ బబ్లీకు చిర్రొత్తికొచ్చి, చికాకుతో మండిప‌డింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: