నిన్నటి దాక మంచు విష్ణు కెరియర్ కు గోల్డెన్ లెగ్ హీరొయిన్ గా ఉండటమే కాకుండా హీరో మోహన్ బాబు కోరాడని చాల చక్కగా నాజూగ్గా   తయారయ్యి  మోహన్ బాబు ప్రశంసలు కూడా అందుకున్న హన్సిక పై  హీరో విష్ణుకు హటాత్ గా  కోపం వచ్చింది. అంతే ఆ కోపంతో షూటింగ్ కు పేకప్ చెప్పేసి విష్ణు దురుసుగా వెళ్లిపోయాడట. అసలు విషయం ఏమిటంటే ‘దేనికైనా రెడీ’ సినిమా షూటింగ్ సమయం నుండి విష్ణు హన్సికలు చాల క్లోజ్ గా మూవ్ అవుతూ వచ్చే వారట. వీరిద్దరి జంట బాగుండటం తో విష్ణు నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో కూడా హన్సికనే హీరొయిన్ గా పెట్టుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది.

ఈ మధ్యనే మన భాగ్యనగరం లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రోమెంటిక్ సన్నివేశాలు హీరో విష్ణు హన్సికలు పై చిత్రీకరించారట. ఎప్పుడు గలగలా నవ్వుతూ సెట్స్ పై అల్లరి చేసే హన్సిక ఈ సారి ఈ షెడ్యుల్ లో చాల ముభావంగా ఉంటూ మోహంలో ఎటువంటి ఫీల్ లేకుండా మన మంచు వారి అబ్బాయి తో రోమెంటిక్ సీన్స్ చేసిందట. దీనితో హీరో విష్ణు ఎంత ప్రయత్నించినా రోమెంటిక్ మూడ్ రాక పోవడంతో ఏమి చేయాలో తెలియక తల పట్టుకున్నాడట. అంతేకాకుండా ఆ షూటింగ్ స్పాట్ లో ఒక కుర్చీ లో మూలా గా కూర్చుని ఉండటంతో షాక్ అయిన హీరో విష్ణు ఆ రోజు షూటింగ్ ని కేన్సిల్ చేయడమే కాకుండా మరునాడు షూటింగ్ కు కూడా హీరో విష్ణు రాలేదట. దీనితో అవాక్ అయిన హన్సిక మద్రాసు చేక్కేసిందట. ఇక లాభం లేదు అనుకున్న ఫిలిం యూనిట్ వారు విష్ణు హన్సికల రోమెంటిక్ సీన్స్ మళ్ళి రీషూట్ చేసే ఉద్దేశ్యం లో ఉన్నారట.

ఇంతకీ హన్సిక అంత బెంగ దేనిగురించి పెట్టుకుందో ఫిలిం యూనిట్ వారికి తెలియలేదట. ఈ మధ్య హన్సిక ప్రేమికుడు హీరో శిoభు తండ్రి దర్శకుడు రాజేందర్ ఈ మధ్య కోలీవుడ్ లో ఒక కామెంట్ చేసాడు హన్సికను ప్రేమిస్తున్నానని శిoభు తనకు చెప్పలేదని అందువల్ల తన కుమారుడు శిoభూకీ హన్సికకు పెళ్లి అంటారేమిటి అంటూ వార్తలకేక్కాడు. బహుశా ఆ వార్తలను చూసి షాక్ అయి హాన్సిక విష్ణుతో ఇలా ప్రవర్తించింది అనుకోవాలి. అయినా నిన్నటిదాకా మంచు వారి కుటుంబం ఇలా హటాత్ గా యూటర్న్ తీసుకుని కోపగోస్తే ఎలా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: