అభిమానుల హ‌డావుడికి దూరంగా లండ‌న్‌లో 1 సినిమా బృందం మ‌ధ్య ఈసారి పుట్టిన‌రోజును జ‌రుపుకొంటున్నాడు మ‌హేష్‌. అయితే అభిమానుల‌కు మాత్రం త‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని నిర్ణయించుకొన్నాడు. అందుకోసం ప‌ది రోజుల ముందుగానే లండ‌న్‌లో చిత్రీక‌రించిన 1 సినిమా ర‌షెస్ హైద‌రాబాద్‌కి వ‌చ్చేశాయి. సుకుమార్ స‌ల‌హాల‌తో ఎడిట‌ర్లు టీజ‌ర్లు క‌ట్ చేశారు.

మ‌హేష్ పుట్టిన రోజు రేపే. ఉద‌య‌మే మాట‌ల‌తో కూడిన టీజ‌ర్ ని యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. లండ‌న్‌లో తెర‌కెక్కించిన 1 స‌న్నివేశాల గురించి తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటిదాకా తెలుగు తెర‌పై ఎవ్వరూ తీయ‌నివిధంగా స‌న్నివేశాలు తీశార‌ని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే క‌నీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఆ ర‌షెస్ నుంచి వ‌చ్చిన టీజ‌ర్ ఎలా ఉంటుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

1కి సంబంధించిన ఓ గీతాన్ని కూడా లండ‌న్‌లో చిత్రీక‌రిస్తున్నారు. విదేశీభామ సోఫియా చౌద‌రి ఇందులో ఆడిపాడుతోంది. ఆ పాట కూడా ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. ఆ పాట పూర్తయ్యాకే మ‌హేష్ హైద‌రాబాద్‌లో దిగుతాడ‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: