టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నడూ జ‌ర‌గ‌ని వింత‌, ఎవ‌రూ చేయ‌ని సాహసం 2013 వ సంవత్సరంలో జ‌రిగింది. ఇది నిజంగా టాలీవుడ్‌కి మంచి రోజులు వ‌స్తున్నాయ్ అని చెప్పటానికి జ‌రిగిన శుభ‌ప‌రిణామం. అదే విక్టరి వెంక‌టేష్‌, ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు. ఇంతటి పెద్ద స్టార్లతో మూవీను నిర్మించిన దిల్‌రాజు నిజంగా సాహ‌సోపేతుడు. ఏది ఎలాగున్నా వెంక‌టేష్‌,మ‌హేష్ న‌టించిన మ‌ల్టీస్టారర్ మూవీను యావ‌త్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్రశంశ‌నీయ‌బ‌డింది. అయితే ఇందులో జ‌రిగిన జిమ్మిక్కు విక్టరీను క‌ల‌వ‌ప‌రించ‌ద‌నే చెప్పాలి.

మ‌హేష్‌ను మంచిగా చూపించిన ద‌ర్శక‌వ‌ర్గం, విక్టరి పాత్రకు అంత‌గా న్యాయం చేయ‌లేక పోయింది. ఒంటి చేత్తో సినిమాను శాసించగ‌ల వెంక‌టేష్‌కు స‌రైన న్యాయం చేకూర‌లేద‌నేది ఇండ‌స్ట్రీ వాద‌న‌. మొద‌టి సారిగా తీసిన మ‌ల్టీస్టారర్ మూవీలోనే విక్టరీను జీరో చేస్తే, ఇటువంటి అన్యాయ‌మే మ‌రోసారి జ‌రుగుతుంది. విశ్వస‌నీయ స‌మాచారం మేరకు సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల‌తో ఒక మల్టీస్టార్ ఫిల్మ్ రూపొంద‌బోతుంది.

ఇందులోనూ విక్టరి పాత్ర అంతంత మాత్రమ‌నే అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను బండ్ల గ‌ణేష్ నిర్మించి అవ‌కాశం ఉంది. ద‌ర్శకుడిగా కృష్ణవంశీకు ఈ అవ‌కాశం రావ‌చ్చు. లేకుంటే ఈ ప్రాజెక్ట్‌కి కొర‌టాల శివ‌ ద‌ర్శక‌త్వ ఛాన్స్ ద‌క్కే అవకాశం ఉంద‌ని టాలీ స‌మాచారం. ఎందుకంటే ఈ మ‌ల్టీ స్టారర్ మూవీను బండ్ల గ‌ణేష్ నిర్మించ‌డానికి రెడీ అవుతున్నాడు క‌నుక, బండ్ల గ‌ణేష్‌, కొర‌టాల శివ మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టంతో ఈ విధ‌మైన కాంబినేషన్ తెర‌పైకి రావ‌చ్చనే వాద‌న విన‌ప‌డుతుంది. ఏదైమైనా విక్టరినీ మ‌రోసారి జీరో చేసే ప్రయ‌త్నాలు ఉంటాయ‌నేది ఇండ‌స్ట్రీ వాద‌న‌. ఎందుకంటే మ‌ల్టీస్టారర్ మూవీల‌కి విక్టరీనే ఎటువంటి డిమాండ్స్ లేకుండా ముందుకు వ‌స్తాడు. అందుకే అత‌ని పాత్రపై పెద్ద మార్పులు చెప్పుకోలేని మ‌న‌స్తత్వం విక్టరిది.

మరింత సమాచారం తెలుసుకోండి: