మొన్నటి వ‌ర‌కూ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు రొమాన్స్ చేసుకున్నారు. డేటింగ్ పూర్తిచేసుకున్నారు. విడియారు, మ‌ళ్ళీ క‌లుసుకున్నారు. చివ‌రికి ఎవ‌రికీ అర్ధంకాకుండా తిట్టుకుంటున్నారు. వీళ్ళను ద‌గ్గర‌నుండి చూసిన వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదంతా బాలీవుడ్ టాప్ ఎఫైర్ మేట‌ర్‌. ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,దీపికా ప‌దుకుకొనె,క‌త్రినాకైఫ్ ముగ్గరి మ‌ధ్య జ‌రిగిన ఎఫైర్ చిరిరికి ఒక కొలిక్కి వ‌చ్చింది. ముగ్గురు క‌లిసి ఒక నిర్ణయానికి వ‌చ్చారు.

ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,దీపికాల‌ది మొద‌టి నుండి కొన‌సాగుతున్న ఎఫైర్‌. వీళ్ళిద్దరి మ‌ధ్యలోకి క‌త్రినా వ‌చ్చి దీపికాను వేరు చేసింది. త‌రువాత మ‌ళ్ళి దీపికా,ర‌ణ్‌భీర్‌లు క‌లిసి క‌త్రినాను దూరం చేశారు. రీసెంట్ గా ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,క‌త్రినా స్పెయిన్ టూర్ తిరిగి దీపికాకు కోపం తెప్పించింది. ఇప్పుడు ర‌ణ్‌భీర్ అంటే దీపికాకు ఒళ్ళుమంట‌. దీనంత‌టికి కార‌ణం క‌త్రినా అని తెలుసుకొని క‌త్రినాను ఎలాగైనా త‌ప్పించాలని ర‌ణ్‌భీర్‌కు స్ట్రాంగ్ వార్మింగ్ ఇచ్చింద‌ట దీపికా.

వీళ్ళిద్దరి మ‌ధ్యలో న‌లిగిపోతున్న ర‌ణ్‌భీర్ చివ‌ర‌గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. వారం రోజుల క్రితం ఇద్దరిని పిలిచి మీరే డిసైడ్ చేసుకోండి అంటూ వెళ్ళియాడు. దీంతో ఇప్పుడు క‌త్రినా అంటే దీపికాకు, దీపికా అంటే క‌త్రినాకు ఏమాత్రం ప‌డ‌టం లేదంట‌. ఇద్దరూ క‌లిసి ర‌ణ్‌భీర్‌కు చెక్ పెట్టి మ‌రోవాడ్ని చూసుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ని 'బి-టౌన్ బిగ్ ఎఫైర్ బ్రేక్' అంటూ బాలీవుడ్ అంత‌టా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: