అచ్చ తెలుగు అమ్మాయి హీరొయిన్ నందితకు అదృష్టం జిడ్డులా పట్టుకుంది. ప్రస్తుతం యూత్ లో ఆమెకు ఉన్నంత క్రేజ్ ఏ హెరాయిన్ కు లేదు. ప్రేమ కధా చిత్రమ్ సినిమా తరువాత ఈమె టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. ఈ సినిమాతో ఈమె నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అటువంటి లక్కీ హీరొయిన్ నందిత మెగా ఫ్యామిలీ లో కలిసిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కుటుంబం లోని ఏ హీరోతో నందిత నటిస్తోంది అనే విషయం పై క్లారిటి లేదు. కొంతమంది బన్నీనటిస్తున్న రేసుగుర్రం లో సెకండ్ హెరాయిన్ చాన్స్ నందిత కొట్టేసింది అంటూ ఉంటే, మరికొందరు రామ్ చరణ్ నటించబోయే కొత్త సినిమాలో నందితే మెయిన్ హీరోయిన్ అంటున్నారు.

ఈ రెండు కాకుంటే మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో కొత్త సినిమాకు నందిత హీరోయిన్ అంటున్నారు. ఇలా ఫిలింనగర్ లో మెగా కుటుంబ హీరోల కొత్త సినిమాలకు సంబందించిన ఏ వార్తలు విన్నా అందులో నందిత పేరు లేకుండా ఉండటం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రస్తుతం నందిత కేరాఫ్ మెగా ఫ్యామిలీ గా మారిపోయింది అనుకోవాలి. అదృష్టం ఉంటే ఎవరికైనా ఇలాగె అవకాశాలు తన్నుకు వస్తాయి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: