దేశంలో నేడు ఎక్కడ చూసినా  మనోభావాల సీజన్  నడుస్తోంది.  కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని , భాషని, వృత్తుల్నిని ఇలా ఏ వర్గాల ప్రజల పై  కామిడి చేస్తూ సినిమాలలో సన్ని వేశాలు పెడితే వెంటనే తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ ఉద్యమాలు లేస్తున్నాయి. అంతే కాదు ఆ సినిమా నిర్మాతల పై కోర్టు కేసులను కూడా వేస్తున్నారు.  ఇప్పుడు ముంబై పోలీసులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని  ఒక సినిమా నిర్మాత పై ఫైర్ అనుతున్నారు.

దానికి కారణం బాలీవుడ్ స్టార్ బ్యూటి  ప్రియాంకచోప్రా. 'జంజీర్' చిత్రంలోని ఓ పాటలో ఆమె బిగువైన కురచ నిక్కర్ ధరించి పాటలో డాన్స్ చేసింది ఈ పాట కూడా చాల సూపర్ హిట్ అయింది.  అదే పోలీసుల నిరసనకు కారణమయ్యింది.  అదేమిటి అని అనుకుంటున్నారా?  అలాంటి నిక్కర్లు చాలామంది హీరోయిన్స్  చాలాసార్లు ధరించారు కదా అనుకుంటున్నారా కానీ ఈ విషయం ఏంటంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని కింద మాత్రం కురచ ఖాకీ నిక్కర్ ధరించింది ప్రియాంక చూడ్డానికి ఆ వేషధారణ మరీ అసభ్యకరంగా ఉండటంతో పోలీసులు సదరు దర్శక, నిర్మాతల వద్ద అభ్యంతరం వెలిబుచ్చారట. 

ముఖ్యంగా మహిళా పోలీసులైతే ఈ డ్రస్ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారని అంటున్నారు . పోలీస్ గొప్పతనాన్ని తెలిపే పాట ఇదని, సాహిత్యం కూడా పోలీసులను  పోలీసు వ్యవస్థను  కొనియాడుతూ ఉండే పాట ఇది అని  దర్శకుడు అపూర్వ లాఖియా ఎంత చెప్పినా ముంబయ్ పోలీసులు ససేమిరా ఒప్పుకోవడంలేదట.  మరి  ఈ అభ్యంతరాల నేపధ్యంలో ఈ  పాటను మళ్ళీ రీ షూట్ చేస్తారా లేకుంటే తొలగిస్తారా అనే విషయం చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: