ఒకరి బ్యాడ్ లక్ మరొకరికి గుడ్ లక్ అవుతుందంటే ఇదే మరి... నాలుగు సినిమాలు తీసి నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకున్న ఎందరో నిర్మాతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాడ్ లక్ పైనే గంపెడాసలు పెట్టుకున్నారు. అతని సినిమా ఆగిపోతే బాగుండు అంటూ దేవున్ని వేడుకుంటున్నారు.

ప్రస్థుతం తెలగులో ఈనెల 15న విడుదలకు సిద్దం అయ్యేందుకు బోలెడు సినిమాలు సిద్దమయ్యాయి. వాటిలో జగద్గురు ఆదిశంకర, దళం, అంతకుముందు ఆతరవాత,1000అబద్దాలు, మెరీనా వంటివి ఉన్నాయి. అయితే పవన్ అత్తారింటికి దారేది విడుదల కాకపోతేనే వీటిని చేసేందుకు సిద్దమయ్యారు ఆసినిమాల నిర్మాతలు.

కారణం వారివి చిన్న సినిమాలు, పవన్ అత్తగారిల్లు వచ్చిందనుకో అసలు వారికి థియేటర్లు దొరకవు, ఒక వేళ దొరికినా అంత స్టార్ సినిమా ముందు పాపం వీరి సినిమాలు కుదేలవుతాయి. అందుకే పవన్ అదృష్టం కాస్థా బ్యాడ్ గా తయారై ఆయన అత్తగారింటికి దారేది వాయిదా పడాలని కోరుకుంటున్నారు ఎందరో నిర్మాతలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: