పవన్ కళ్యాణ్ అంటే అందరికి తెలుసు, ఆయనకు దయ, దాక్షిన్యాలు ఎక్కువ. అందుకే సమంత కు బుక్కయ్యాడు పవర్ స్టార్. కారణం సమంతకు అలాంటి సంఘసేవా పనులంటే ఇష్టం. అందుకే ఆమె చేసే ఓ సమాజసేవకు పవన్ కళ్యాణ్ బట్టలు అమ్మేస్థోంది.

ఇది మరీ బాగుందండీ... అమ్మడు చేసి పనికి పవన్ బట్టలమ్మడమేమిటి, ఇక పుణ్యం ఆమెకు ఎలా దక్కుతుంది అనుకోకండి, సమంత కూడా తనవి అమ్మేస్థోంది లెండి. ఇదంతా హైదరాబాద్ లోని ప్రత్యూష ఫౌండేషన్ కోసం చేస్థోంది సమంత. ఆమెకు అనాధపిల్లలను అందులోను ఆడపిల్లలను ఆదుకోవడం అంటే ఇష్టం.

అందుకే ఆపనికోసం తానే కాకుండా తన తోటి హీరో, హీరోయిన్ల సహాయాన్ని కూడా కోరుతోంది. ఇలాంటి వాటిలో ముందుండే పవన్ కళ్యాణ్ నే ఆమె ఫస్ట్ ఎన్నుకుంది. ఈసారికి ప్రత్యూష్ ఫౌండేషన్ పిల్లల కోసం తన క్యాస్టూమ్స్ తో పాటు గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ దరించిన పోలీసు దుస్థులను కూడా వేలం వేసి ఆడబ్బులను అనాదపిల్లలకు ఇవ్వనుంది. ఈమేరకు సమంత పవన్ కళ్యాణ్ తో పాటు చిత్రనిర్మాత అనుమతి కూడా తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: