రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యులు చిత్రసీమ‌లో బోలెడంత మంది ఉన్నారు. కొద్దిమంది అచ్చం వ‌ర్మలాంటి సినిమాలే తీస్తే మ‌రికొద్దిమంది అందుకు పూర్తి భిన్నమైన సినిమాలు తీస్తుంటారు. అయితే ఆ టేకింగ్‌లో మాత్రం వ‌ర్మ ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తుంటుంది. ఇటీవ‌ల వ‌ర్మ శిష్యుడిగా చెప్పుకొంటూ జీవ‌న్‌రెడ్డి తెలుగు ప‌రిశ్రమ‌లోకి అడుగుపెట్టాడు. తొలి ప్రయ‌త్నంగా ద‌ళం అనే సినిమాని తెర‌కెక్కించాడు.ఆ సినిమా ఆగ‌స్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

న‌వీన్‌చంద్ర, పియాబాజ్‌పాయ్ జంట‌గా న‌టించిన చిత్రమిది. న‌క్సలిజం నేపథ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. స‌మాజానికి ఏదో చేయాల‌నే త‌ప‌ప‌తో అన్నలుగా మారిన యువ‌కుల క‌థ అనీ, మ‌ళ్లీ జ‌న‌జీవ‌న స్రవంతిలోకి అడుగుపెట్టాల‌నుకొన్న ఆ ద‌ళానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌న్నదే ఈ చిత్రం.

విడుద‌ల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో చిన్న చిన్న సినిమాల‌న్నీ బ‌య‌టికొస్తున్నాయి. ఎప్పుడో సిద్ధమైన ద‌ళం థియేట‌ర్లు ఖాళీ లేక‌పోవ‌డంతో విడుద‌ల‌కు నోచుకోలేక‌పోయింది. ఎట్టకేల‌కు ఆ సినిమాకి మోక్షం ల‌భించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: