తెలుగ‌మ్మాయి హీరోయిన్‌గా వ‌స్తే ఆద‌ర‌ణ కంటే అవ‌మానాల‌నే ఎక్కువుగా ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. ఆ అవ‌రోధాల‌ను దాటి నిల‌బ‌డిందంటే త‌నే నెం1. ఇప్పుడు అదే ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది మ‌న తెలుగు హీరోయిన్ బింధుమాధవి. బింధుమాధ‌వి కోళీవుడ్ తెర‌కు ప‌రిచ‌య‌మైన త‌రువాత టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు మొద‌ల‌య్యాయి. ఈ బేబి చేసిన సినిమాలు తెలుగులో త‌క్కువ‌యినా, త‌నేంటో నిరూపించుకుంది. అయితే లాంగ్‌టైంలో మాత్రం టాలీవుడ్‌లో నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఇక్కడ ఆఫ‌ర్ల కోసం వెతుక్కునే బ‌దులు కోళీవుడ్‌లో పిలిచి ఆఫ‌ర్లు ఇస్తుంటే ఇక్కడెందుకు ఉండాల‌ని కోళీవుడ్‌కు  చెక్కేసింది.

ఇప్పుడు కోళీవుడ్‌లో బింధుమాధ‌వి చేతిలో నాలుగు మూవీలు ఉన్నాయి. ఇంకా రెండు ప్రాజెక్ట్‌లు ఓకె కావ‌ల్సి ఉంది. ఇదిలా ఉంటే బింధుమాధ‌వి కోళీవుడ్‌కి చెందిన ఓ బిజినెస్ మేన్‌తో సంభంధాలు ఉన్నట్టు ఆ మ‌ధ్య గాసిప్స్ క్రియోట్ అయ్యాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌క‌పోయిన‌న్పటికి, ఈ హీరోయిన్ ఫైనాల్సియ‌ల్ ప‌రంగా బాగా సెటిల్ అయిన‌ట్టు స‌మాచారం. కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల‌ను ఇప్పిస్తుంది కూడ ఆ స‌పోర్టరే అంటూ ఇప్పటికీ కోళీవుడ్‌లో మాట‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: