నిన్న రంజాన్ పండుగ రోజున బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ పట్టాలు మీదకు వచ్చింది. మొదటి రోజునుంచే మసాలా ఎంటర్ టైనర్ గా పోజిటివ్ టాక్ తెచ్చుకుని కేవలం ఐదు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్ టార్గెట్ పై పరుగులు తీస్తోంది. ఈ సినిమా ఓవర్ సీస్ కలెక్షన్స్ కూడా కళ్ళు చేదిరెలా ఉన్నాయి.

నిన్న ఒక్కరోజే విదేశాలలో ఈ సినిమా 6.75కోట్లు వసూలుచేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. యివన్నీ ఇలా ఉంటే నిన్న మన ఆంధ్రప్రదేశ్ లో విడుదలైన ఈ సినిమా పై ఒక విచిత్రమైన టాక్ వినిపించింది. షారుఖ్ ఈ సినిమాను దక్షణాది సినిమాల మసాలాతో దట్టించి ఏ తెలుగు తమిళ సినిమాకు అధికారకంగా ఇది రీమేక్ అని చెప్పకుండా చాలా తెలివిగా ఈ సినిమాను తీసి షార్ట్ కట్ లో హిట్ కొట్టేసాడని అనడమే కాకుండా హీరో సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’, ‘పూల రంగడు’ సినిమాల ఛాయలు ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లో కనిపించాయని టాక్ వినపడుతోంది.

తమిళ తంబీలు ఆరాధ్య దైవంగా భావించే సూపర్ స్టార్ రజినీకాంత్ నిలువెత్తు బొమ్మను సెట్ లో పెట్టుకుని షారుఖ్ చేసిన లుంగీ డాన్స్ కు తమిళ తంబీలు కాసులు కురిపిస్తూ ఉంటే రజనీ ప్రత్యేకంగా షారుఖ్ ను అభినందించడం కొసమెరుపు. సమైఖ్య ఉద్యమాల వల్ల తెలుగులో రావలసిన బడా సినిమాలు ఆగిపోవడం నిన్న తమిళనాడు లో విడుదల కావలసిన హీరో విజయ్ ‘అన్న’ సినిమా కోర్టు ఆదేశాలు తో తమిళనాడు లో ఆగిపోవడం షారుఖ్ వరంగా మారింది. ఎదిఎమైన సునీల్ లాంటి చిన్న హీరో చేసిన సినిమాలు గుర్తుకు వచ్చేలా షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లో ఉడటం సునీల్ ఆనందాన్నిచ్చిందని అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: