బాలకృష్ణకు హీరొయిన్ సమస్య ఈ మధ్య వచ్చినంత గా అతడి కెరియర్ లో ఎప్పుడు వచ్చి ఉండదు. ఇప్పటికే బాలయ్యా, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో మొదలైన సినిమా ఇప్పటికే ఒక షెడ్యుల్ కూడా పూర్తి చేసుకుంది. బాలకృష్ణ రెండు పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ఒక హీరొయిన్ గా ముంబాయి బ్యూటీని సెలెక్ట్ చేసారు. అయితే సమస్య అంతా మెయిన్ హీరొయిన్ విషయంలోనే రావడంతో ఆ మధ్య నయనతార అన్నారు, ఏకంగా కాజల్ అన్నారు. అయితే ఏ హీరొయిన్ పేరు ఫైనల్ గా ప్రకటింపబడలేదు.

కాజల్ నటించే విషయంలో ఎటువంటి క్లారిటి లభించకపోవడంతో ఈ సినిమా దర్శక నిర్మాతల దృష్టి మన తెలుగు తెర సీతమ్మ పై పడిందట. వెంటనే అంజలిని సంప్రదిస్తే ఆమె ఎగిరి గంతేసి బాలయ్యతో నటించడానికి ఒప్పుకుందని సమాచారం. ఇప్పటికే హీరో వెంకటేష్ తో రెండు సార్లు నటించిన మన రాజోలు సుందరి ఇక ఈ సినిమాలో బాలయ్యతో నటిస్తే మన తెలుగు తెర మధ్య వయస్సు హీరోల హీరొయిన్ ల సమస్యకు శాస్వత పరిష్కారంగా మన సీతమ్మ అంజలి టాలీవుడ్ లో తిష్ట వేసిందనే అనుకోవాలి. బాలయ్య పక్కన చివరకు ఈ సీతమ్మైన నిలిస్తే బాగుండును...

మరింత సమాచారం తెలుసుకోండి: