ప్రస్తుతం  మన  దేశం జనాభా విషయంలో చైనా తరువాత స్థానంలో 110 కోట్ల జనాభాతో దేశం నిండి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ జనాభా పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అన్నింటికన్నా ఈ సమస్యకు మెగాస్టార్ చిరంజీవి కారణం అంటూ ఒక కమెడియన్ కామెంట్ చేసి సంచలనం సృస్టించాడు. బుల్లి తెర పై నాగబాబు రోజాలు జడ్జీలు గా వస్తున్న ‘జబర్దస్త్’ ప్రోగ్రాం చాలామందిని ఆకర్షిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్ ధనరాజ్ ఆ స్కిడ్ లో నటిస్తూ ఒకేసారి ఈ దేశంలో ఇన్ని సమస్యలు పెరిగి పోవడానికి జనాభా పెరుగుదల కారణం అంటూ ఆ జనాభా పెరుగుదలకు చిరంజీవి కారణం అంటూ ధనరాజ్ చిరంజీవి తమ్ముడు నాగబాబు వైపు చూస్తూ సెటైర్ పేల్చడంతో నాగబాబు ఉలిక్కి పడ్డాడు.

అయితే తెలివిగా ధనరాజ్ తన సెటైర్ ను జాగ్రత్తగా మలుచుకుని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వల్ల ఎన్నో లక్షల ప్రాణాలు ప్రమాదం నుంచి బయట పడుతున్నాయని దీనితో బ్రతికిపోయిన వారంతా దేశ జనాభాను పెంచేస్తున్నారని మాట తిప్పడంతో ఈ షోలో ఇప్పటికే అతిగా నవ్వుతున్న నాగబాబు మరింత అతిగా నవ్వడంతో ధనరాజ్ సెన్సాఫ్ హ్యుమర్ కు అందరూ ఫిదా అయిపోయారట.... 

మరింత సమాచారం తెలుసుకోండి: