సత్తా చూపుకోవడానికి వయసుతో పనిలేదంటోంది పాలబుగ్గల హీరోయిన్ తమన్నా. అంతే కాదండోయ్, ఎంత తిన్నా లావుకాకూడదట, మాధురిధీక్షిత్ లా పుట్టాలట, ఎప్పుడు కుటుంబ సభ్యులతో గడపాలట, ఒక వేల దేవుడు వరమందిస్థే ఇవే కోరికలు కోరుకుంటుందట తమన్నా.

తాజాగా ఓ మీడియాతో తన మనసులోని మాటలను పంచుకుంది, ప్రతిభకు వయసుతో పనిలేదు అంది. నయనతార, సమంత, కాజల్ తనకు మంచి మితృరాళ్లు అని చెప్పింది. చేపలపులుసు, హైదరాబాద్ బిర్యాణి, పంజాబివంటలు తెగ ఇష్టమని సెలవిచ్చింది, ఈ మాట చెప్పాక అర్థం అయిందనుకుంటా ఎంత తిన్నా కూడా లావుకాకూడదని తమన్నా  దేవున్ని ఎందుకు కోరుకుంటుందో.

చిన్నప్పుడు ఏసినిమా చూస్థే తనను ఆసినిమా పేరుతో పిలిపించుకునేదట తమన్నా. అంతే కాదు తెగ సిగ్గుపడేదట ఆ వయసులో, షాపింగ్, మేకప్ ఆతర్వాత చప్పటి చపాతీల ఈటింగ్ తమన్నా చేసే పనులట. అంతే కాదు ప్రజాప్రతినిధి అయితే మహిళల కోసం టాయిలెట్లు కట్టిస్థుందట, కఠిన చట్టాలు అమలు చేస్థుందట, రోడ్డుపై చెత్త పోయకుండా నిబందనలు కూడా పెడతానంటోంది తమన్నా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: