రాంచరణ్ పరిస్థితి రామగోవిందా అంటున్నారు టాలీవుడ్, బాలీవుడ్ లోను, మరో వైపు పవన్, మహేష్ లు తమ సినిమాలతో సామాజిక వెబ్ సైట్లలో రికార్డులు కొట్టుకుంటుంటే ఏకంగా వారికంటే రెండింతలు అంటే మూడుసినిమాలతో ముంచెత్తేందుకు వస్థున్నరాంచరణ్  పరిస్థితి గోవిందా.. అని ఎందుకంటారు అనుకోకండి..

మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దమవడమే రాంచరణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టగా నిర్మాతలను నిండా ముంచుతున్నాయట. కారణం రాష్ట్రంలో నెలకొన్న సీమాంధ్ర అల్లర్లకు ఇప్పటికే ఎవడు, అత్తారింటికి దారేది సినిమాలు ఆగిపోయాయి, ఈ అబ్బాయి, బాబాయి సినిమాలు ఎప్పుడు వస్థాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

అయితే హిందీలో తీసిన జంజీర్ ను విడుదల చేసయినా ఈ బాదనుంచి బయట పడదాం అనుకున్న రాంచరణ్ కు ఆ సినిమా నిర్మాతలు కూడా షాకిచ్చారు. రాంచరణ్ జంజీర్ సినిమాపై బాలీవుడ్ లోనే టాలీవుడ్ మార్కెట్ కలెక్షన్లపైనా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాకూడా జంజీర్ కు కష్టాలే.

సీమాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ భగ్గుమంటుంది, తెలంగాణకు అనుకూలంగా ముందుకు పోతే ఇప్పుడున్న పరిస్థితి సీమాంధ్రలో మరింత ముదురుతుంది. హిందీ సినిమాలకు తెలంగాణలోనే మార్కెట్ ఎక్కువ. పోని బాలీవుడ్  లో విడుదల చేసినా, హింది సినిమానే కదా అని టాలీవుడ్ లో విడుదల చేసినా జంజీర్ ప్రభావం తూఫాన్ పై పడుతుంది. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో విడుదలయితేనే నిర్మాతలకు లాభం. అందుకే ఈ సినిమాల విడుదల కూడా ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: