బాలక్రిష్ణ అప్‌క‌మింగ్ మూవీ ఇప్పుడు ఇండ‌స్ట్రీ టాక్ అయింది. బోయపాటి,బాల‌య్య కాంబినేష్ టాలీవుడ్‌లో వైబ్రెంట్ క్రియోట్ చేస్తుంది. సింహా మూవీ త‌రువాత వీరిద్దరి కాంబినేష‌న్ మ‌ళ్ళీ స‌క్సెస్‌ను త‌ల‌పిస్తుందని ఇండ‌స్ట్రీ గ‌ట్టిగానే నమ్ముతుంది. రీసెంట్‌గా రామోజీఫిల్మ్‌సిటిలో బాల‌య్య గెట‌ప్ కామెంట్స్‌కు అతీతంగా ఉందంటున్నారు. ఆ గెట‌ప్‌లో బాల‌య్య నాచ్యురాలిటికి చాలా ద‌గ్గగా ఉన్నాడ‌ని అభిమానులు చూసి సంతోషంగా ఫీల‌య్యారంటా. అంతే కాకుండా ఈ మూవీ సింహా మూవీకు సీక్వెల్‌లా ఉండ‌బోతుంద‌ని, అయితే కొద్దిగా పొలిటిక‌ల్ ట‌చ్‌తో భావ‌ద్వేగాల‌ను కలిగిస్తుందన యూనిట్ టాక్‌.

రాష్ట్ర విభ‌జ‌న అంశాన్ని పోలుస్తూ రెండు ప‌ల్లెటూర్ల మ‌ధ్య గొడ‌వ‌గా, వారి భావోద్వేగాల‌ను చూపించ‌బోతున్నార‌ని విశ్వశ‌నీయ స‌మాచారం మేర‌కు బ‌య‌ట‌కు తెలిసింది. అయితే బోయ‌పాటి శ్రీను మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడంట‌. ఎందుకంటే సింహా త‌రువాత చాలా క‌థ‌ల‌ను హీరోల‌కు వినిపించినా బోయ‌పాటికి నో చెప్పారు. దాంతో చేసేది లేక నంద‌మూరి బాల‌క్రిష్ణతో త‌ప్పని పరిస్థితుల్లో జోడి క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని టాలీ టాక్‌. అందుకే బాల‌య్య ప‌వ‌ర్ ఏంటో మ‌ళ్ళీ చూపిచాలని, త‌న ద‌ర్శక‌త్వ ప్రతిభ‌కు మ‌రోసారి సాన పెడుతున్నాడు బోయ‌పాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: