అక్కినేని హీరో నాగార్జున న‌టించిన భాయ్ మూవీ హంగామ మొద‌లైంది. ఇందులోని డైలాగ్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేసాయ్‌. రోటీన్‌కి భిన్నంగాను, డిప్రెంట్‌గాను ఆలోచించే నాగార్జున, చాలా గ్యాప్ త‌రువాత ఓ కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా ఉన్న మూవీలో న‌టించాడు. భాయ్ మూవీ మీద‌, వీర‌భ‌ద్రమ్ డైరెక్షన్ మీద నాగార్జున పూర్తి న‌మ్మకంతో ఉన్నాడు. భాయ్ మూవీలో డైలాగ్స్ అక్కినేని అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్నాయి.

“6 వరకే నేను భాయ్.. ఆ తరువాత ప్లే బాయ్”

“అట్మాస్ఫియర్ వయలేంట్ గా వుందంటే ఫీల్డ్ లోకి భాయ్ ఎంటర్ అయినట్టే …”

“హైదరాబాద్ లో ఫేమస్ అయినవి రెండే.. ఒకటి ఇరానీ చాయ్.. రెండు ఈ భాయ్”


వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భాయ్ మూవీలో దాదాపు ప‌ది పంచ్ డైలాగ్‌లు ఉన్నాయంట‌. వీటిలోని ఓ మూడు డైలాగులు ప్రొడ‌క్షన్ యూనిట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆఫ‌ర్లు లేని హీరోయిన్ రిచా గంగోపాధ్యయకి నాగార్జున స‌ర‌స‌న ఛాన్స్ రావ‌డంతో ఈ మూవీలో రిచా రెచ్చిపోయ‌న‌ట్టు స‌మాచారం. ఈ సెప్టెంబర్ నెల‌లోనూ ఆడియో విడుదలకు రెడీ అవుతుంది భాయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: