హీరోయిన్లకు వాడకం అంటే ఎంటో తెలిసేది హీరోల ద‌గ్గర కానే కాదు. ద‌ర్శకుల ద‌గ్గరే ఆ విష‌యం గురించి బాగా తెలుసుకుంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్స్ పరిచ‌యం చేసే క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్ పూరి జ‌గన్నాథ్ ఆ విష‌యంలో ఒక‌డుగు ముందుగానే ఉంటాడు. ఆసిన్ ద‌గ్గర నుండి నేటి న‌యా హీరోయిన్స్ వ‌ర‌కూ పూరి హ్యాండిల్ చేసిన తీరువేరు. మొన్నటికి మొన్న కేథ‌రిన్ థెరిస్సా అందాల‌ను సిల్వర్‌స్క్రీన్ మీద క‌నువిందు చేశాడు. ఆ త‌రువాత కేథ‌రిన్ అంటే హాట్ బ్యూటీ త‌ప్ప యాక్టింగ్ బేబి కాదంటూ టాలీవుడ్‌లో ముద్ర ప‌డింది. ఇప్పుడు పూరి క‌న్ను మ‌రో బాలీవుడ్ హీరోయిన్ మీద ప‌డింది.

1920 అనే బాలీవుడ్ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన అదా శ‌ర్మను ట‌చ్ చేయ‌బోతున్నాడు. ఈ బ్యూటీను నితిన్ స‌ర‌స‌న నిల‌బెట్టేందుకు మాట‌లు క‌దుపుతున్నాడు. పూరిజ‌గ‌న్నాథ్‌,నితిన్ కాంబినేష‌న్‌లో రాబోయో మూవీకు ఇద్దరి హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో కేథ‌రిన్ థెరిస్సా, అలాగే బాలీవుడ్ హీరోయిన్ అదాశ‌ర్మ. హిందిలో మూడు మూవీలు మాత్రమే చేసిన ఈ బాలీవుడ్ హాటీ, ఎట్ ప్రెజెంట్ ల‌వ‌ర్ అనే మూవీలో నారారోహిత్ స‌ర‌స‌న యాక్ట్ చేస్తుంది.

ఎలాగూ టాలీవుడ్ మోజుతో ఇక్కడ‌కు వ‌చ్చింది కాబ‌ట్టి పూరి ఈ బాలీవుడ్ హీరోయిన్‌కు ఆఫ‌ర్ ఇచ్చడంట‌. త‌న అందాల‌ను నిస్సంకోచంగా చూపించ‌టంలో ఏమాత్రం మోహ‌మాట‌ప‌డ‌ని ఆద‌శ‌ర్మకు క‌రెక్ట్ ప‌ర్సన్ పూరీనే అని టాలీవుడ్ అంటోంది. ఎంతైన పూరి వాడకం అంటే ఏంటో తెలియాలంటే మూవీ రిజ‌ల్ట్ త‌రువాత మాత్రమే ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆశ‌లతో నేనింతే మూవీతో హీరోయిన్‌గా వచ్చిన శియ, త‌న అందాల‌న్ని ఆర‌బోసినా ఆ త‌రువాత‌ ఫ‌లితం లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు కేథ‌రిన్‌,అదాశ‌ర్మలా ప‌రిస్థితి కూడ త‌యార‌వుతుంద‌ని టాలీటాక్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: