హమ్మయ్యా... ఎప్పుడెప్పుడు రాంచరణ్ నటించిన  ‘ఎవడు’ చూస్థామా... అని ఎదిరిచూస్థున్న మెగా అభిమానులకు ఆ సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు దసరసంబారాలు జరుపుకునేందుకు అక్టోబర్ 10న విడుదల తేదీని ఖరారు చేసారు. దీంతో ఎవడు కోసం ఎదిరి చూస్థున్నవారికి కాస్థా ఊరట కలిగింది.

మొదట జూలై 31 వతేది అనుకున్నారు, బాబాయ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ ఆగస్టు 7న ఉండడంతో దీనిని ఆగస్టు 21కి వాయిదా వేసారు. ఇంతలో సమైక్యాంధ్ర ఆందోలనకారులు, సమైక్యాంధ్ర మెగా అభిమానులు చిరంజీవి రాజీనామా చేయకపోవడాన్ని వ్యతిరేకిస్థూ ఎవడు పోస్టర్లను చించి వేసారు.

రాజమండ్రి ఎవడు డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం ముందు ఆంధోళన చేసారు. దీంతో ఈ గొడవలు సద్దుమనిగే దాకా అంటూ నిరవధిక వాయిదా వేసారు. చివరకు దసరా వరకు అంతా సర్దుకుంటుంది, పైగా సెలవులు కూడా కలిసివస్థాయి అంటూ అక్టోబర్ 10 వతేదిన ‘ఎవడు’ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు దిల్ రాజు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: