2012, న‌వంబ‌ర్ 13 దీపావ‌ళి ఫెస్టివ‌ల్‌కి ఆ ఇద్దరి హీరోలు కొట్టుకునేంత పని చేశారు. నిజంగానే ఆ హీరోలు ఒక‌రిమీద ఒక‌రు క‌త్తులు దూసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. కోర్టు వ‌ర‌కూ వెళ్ళారు. వాళ్ళిద్దరే బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌, యాక్షన్ వీరుడు అజ‌య్‌దేవ‌గ‌న్‌. అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టించిన స‌న్ ఆఫ్ స‌ర్ధార్‌, షారుఖ్ న‌టించిన జ‌బ్ త‌క్ హై జాన్ మూవీలు రెండు 2012 దివాళి రోజున రిలీజ్ అయి బాక్సాపీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డాయి. ఫ‌లితంగా అజ‌య్‌దేవ‌గ‌న్‌, షారుఖ్‌ల మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది.

ఈ గొడ‌వ‌లో పై చేయిగా షారుఖ్ గెలిచిన‌ప్పటికి అజయ్‌దేవ‌గ‌న్ మూవీ కూడ మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ప్రతి దివాళి పండుగ నాడు షారుఖ్‌,అజ‌య్‌దేవ‌గ‌న్‌ల పోటీ కామ‌న్‌గా జ‌రుగుతుంది. కాని 2012 సంవ‌త్సరంలో అది తారాస్థాయికి చేరింది. దీంతో షారుఖ్‌,అజ‌య్ దేవ‌గ‌న్ ఇద్దరూ వ్వక్తిగ‌తంగానూ దూర‌మైనార‌ని బాలీవుడ్ స‌మాచారం. సీన్ క‌ట్ చేస్తే ఈ సంవ‌త్సరం 2013లో ఇది రిపీట్ కాకుడ‌ని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఈ దివాళికి బిగ్‌పైట్‌కి తెర‌లేపుతారు అనుకున్న బాలీవుడ్‌కి ఆ క‌న్‌ఫ్యూజ‌న్‌ను తొల‌గించారు.

దిపావ‌ళి కంటే ముందుగానే వీరి మూవీలు రిలీజ్ అయ్యాయి. చెన్నె ఎక్స్ ప్రెస్ మూవీ ఆగ‌ష్టు 7న రిలీజ్ అయి మైండ్‌బ్లోయింగ్ క‌లెక్షన్లను కొల్లగొడుతుంటే, ఆగ‌ష్టు 15న బిగ్‌బి,క‌రీనా,అజ‌య్‌దేవ‌గ‌న్‌లు న‌టించిన స‌త్యాగ్రహ మూవీ రిలీజ్ అవుతుంది. వీరిద్దరూ ఈ సారి దీవాళికు పోటి పెట్టుకోకపోవ‌డంతో ఈ సంవ‌త్సర‌పు బాలీవుడ్ దివాళి బోసిపోయింద‌నే చెప్పాలి. క్రిష్ 3 గా హృతిక్‌రోష‌న్ దివాళికి సింగిల్‌గా వ‌స్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: