రాంచరణ్ పోయిపోయి తన సోదరుడికే పెద్ద దెబ్బ పెట్టాడు. ఎంతో కష్టపడి రెండేళ్ల తర్వాత ఓ సినిమాతో స్టార్ కావాలనుకుంటున్న మెగా ఫ్యామిలీ హీరోకు  అండగా నిలవాల్సిన అదే ఫ్యామిలీ హీరో అడ్డం వస్థే ఎలా ఉంటుంది చెప్పండి.

రాజకీయాల వల్ల మెగా ఫ్యామిలీ పెద్ద బ్రదర్స్ లో విభేదాలు తలెత్తాగా ఇప్పుడు సినిమాల వల్ల వారి వారసులలై మెగా చిన్న బ్రదర్స్ మద్య విభేదాలు తలెత్తాయి అంటున్నారు. రాంచరణ్ కు వరుసకు సోదరులైన వరుణ్ సందేష్, సాయిధరమ్ తేజ లు సినిమాల్లో రానించేందుకు కష్టపడుతున్నవిషయం తెలిసిందే.

లేకలేక రెండేళ్ల తర్వాత వైవిఎస్ చౌదరి సారథ్యంలో శ్రద్దాదాస్, సైయామి ఖైర్ ప్రధాన కథానాయికలుగా సాయిధరమ్ నటించిన ‘రేయ్’ ను దసరాకు విడుదలకు సిద్దం చేసారు. దీంతో నైనా బాక్సాఫీసు వద్ద హిట్టుకొట్టి రాంచరణ్, బన్నీ వంటి వారిసరసన నిలబడే ప్రయత్నం చేయాలనుకున్న సాయిధరమ్ కు రాంచరణ్ షాకిచ్చాడు.

 తన ఎవడు సినిమాను అప్పుడే విడుదల చేస్థూ సోదరున్ని దెబ్బతీసేందుకు సిద్దమయ్యాడు అంటున్నాయి సినిమా వర్గాలు. దీంతో ఎవడు విడుదల మొదట బాబాయి పవన్ కళ్యాణ్ తో, ఇప్పుడు సోదరుడు సాయిధరమ్ తేజతో విబేదాలకు కారణం అయింది. మొత్తం మీద ఈ సినిమా రాంచరణ్ కు అచ్చిరాలేదేమోనన్న వాఖ్యలు వినిపిస్థున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: