బుల్లితెర  యాంక‌ర్ అన‌సూయ త‌న లైఫ్ స్టైల్‌ను మార్చుకుంది. అలాగే అంద‌రిని మార్చేచే ప్రయ‌త్నంలో ఉంది. ముఖ్యంగా టెలివిజ‌న్ రంగాల‌లో అతికొద్ది మంది మాత్రమే ట్రెండ్‌ను క్రియోట్ చేస్తారు. వారిలో అన‌సూయ కూడ చేరింది. హావాభావాల‌తో పాటు, కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్ కూడ ఈమెకు క‌లిసి వ‌చ్చింది. ఆ మ‌ధ్య టాలీవుడ్ ఎంట్రి ఇస్తానంటూ వ‌చ్చిన వార్తల్లో నిజం ఉన్నా కాని నాకు ఇంట్రెస్ట్ లేద‌ని చెప్పి మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. అన‌సూయ‌కు పోటీ ఇవ్వాల‌నుకునే నేటి యాంక‌ర్లు, ఈమె త‌ర‌హాలోనే రెచ్చిపోవాల‌నుకుంటున్నారు. అందుకే జ‌బ్బర్‌ద‌స్థ్‌ ప్రొగ్రామ్‌లో యాంక‌ర్ మారినా, అన‌సూయ అందాల వేడిని రేష్మి కూడ కంటిన్యూ చేయాల్సి వ‌చ్చింది.

పాతుకుపోయిన యాంక‌ర్లను ప‌క్కన పెడితే కొంచెం అటు,ఇటుగా బండి లాగించేస్తున్న యాంక‌ర్లకు ఎక్స్‌పోజింగ్ అనేది త‌ప్పని ప‌రిస్థితి అయింది. ఎవ‌రైన కొత్త యాంక‌ర్లు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంటే అన‌సూయ లాగ ఉండ‌గ‌ల‌వా అంటున్నారంట‌. దాంతో కొంత మంది యాంక‌ర్లకు ఇది త‌ప్పని ప‌రిస్థితి అవుతుంది. అయితే ఎట్ ప్రెజెంట్‌ అన‌సూయ మాత్రం కొద్దిగా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుద‌నే చెప్పాలి. ఈమెను వ‌రించే ఆఫ‌ర్లు అన్ని బోల్డ్ ఎక్స్‌పోజ్‌ను డిపెండ్ చేసుకొనే వ‌స్తున్నాయంట‌. దీంతో అన‌సూయ కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటుంద‌ని బుల్లితెర చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: