దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నవ్వుతూ కనిపించడం చాల అరుదు అంటారు. తరుచు ముడీగా వివాదాస్పద సినిమాలు తీసే వర్మలో హాస్యపు కోణం ఉందీ అనే విషయం చాలామందికి తెలియదు. ఈరోజు రాత్రి వర్మ కూతురు రేవతి డాక్టర్ ప్రణవ్ ను హైదరాబాద్ లో పెళ్ళి చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి వర్మ టాలీవుడ్ కు చెందిన కొంతమంది సన్నిహితులను ఆహ్వానించాడు. అయితే ఈ శుభలేఖ మాత్రం వర్మ లగే చాల వెరైటీగా ఉన్నది.

ఆ శుభలేఖ లో వర్మ ఎలా అతిధులను పిలిచాడో మీరే చదవండి ‘హయ్ నా జీవితంలో తప్పించుకోలేని ఒక విషయం ఈ రోజు చేస్తున్నాను, అదే నా కుమార్తె పెళ్ళి ఆగష్టు 15న సాయంత్రం 8.45లకు మీరు రావాలి అనుకుంటే రండి, నాకుమార్తెను నాఅల్లుడిని ఆశీర్వదించడానికి మాత్రం కాదు, ఈ పెళ్ళిలో నా జోకర్ అవతారాన్ని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా రండి’ అంటు ముగించాడు మన క్రియేటివ్ దైరెక్టర్. ఈ మాటలలోని హాస్యాన్ని ఆస్వాధించిన మన టాలీవుడ్ సేలేబ్రేటీలు మాత్రం వర్మలో ఈ హ్యుమర్ యాంగిల్ కూడా ఉందా అంటు జోక్ చేసుకుంటున్నారు. ఇంతకీ వర్మ ఎటువంటి జోకర్ అవతారంలో అతిధులకు కనిపిస్తాడో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: