త‌ల్లితో ఎప్పుడూ గొడ‌వకు దిగుతూనే ఉంటుంది ఆ బ‌బ్లి బ్యూటి. త‌నే సోనాక్షి సిన్హా. శ‌త్రుఘ్నసిన్హా కూతురిగా బాలీవుడ్ స్క్రీన్‌కు ప‌రిచ‌యం అయిన సోనాక్షి సిల్వర్ స్క్రీన్ ఎంట్రికు తండ్రి ఓకే అన్నాడుకాని అమ్మ ఒప్పుకోలేదంట‌. అయితే అమ్మను క‌న్విన్స్ చేసిన సోనాక్షి, ఎలాగొలా ద‌బాంగ్ మూవీతో ఎంట్రి ఇచ్చింది. మొద‌టి మూవీతోనే బాలీవుడ్ స్టార్‌డం పొజిష‌న్‌ను సొంతం చేసుకున్న సోనాక్షి, మొద‌టి ఫిల్మ్ నుండి ఇప్పటి వ‌ర‌కూ టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. రీసెంట్‌గా ఓ టెలివిజ‌న్‌కి ఇచ్చిన ఇంట‌ర్వూలో అన పేరెంట్స్ గురించి చెబుతునూ ఓ షాకింగ్ న్యూస్‌ను వెల్లడింది.

ద‌బాంగ్ మూవీ అమ్మకు న‌చ్చింద‌ట‌. ఆ త‌రువాత రౌడీ రాథోరో మూవీలో చేసిన ఐటెం సాంగ్ నుండి మాత్రం అమ్మ పూన‌మ్ సిన్హా వ‌ద్ద నుండి చాలా తిట్లను తినాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. స్క్రీన్ మీద ఏమైన అస‌భ్యక‌ర‌మైన దుస్తులు వేసుకుంటే సోనాక్షిసిన్హా అమ్మకు అస్సలు న‌చ్చదంట‌. ఇంకో సారి ఇలాగే చేశాంట నీ చేత సినిమాలు మాన్పించి వేస్తాన‌ని స్ట్రిక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చేద‌ని చెప్పింది. అందుకే డాడి కంటే నేను అమ్మకే ఎక్కువుగా భ‌య‌ప‌డ‌తాను, అలాగే మా ఇద్దరికి ఒక్కొసారి నిజంగా చిన్నపాటి గొడ‌వ‌లు వ‌స్తుంటాయ‌ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: