టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన మంచుమనోజ్ త్వరలో కోర్టులో కొట్లాడేందుకు సిద్దమయ్యాడని అంటున్నాయి సినిమా వర్గాలు. మంచుమనోజ్ కు ఆయన తండ్రి మోహన్ బాబువలే కాస్థా కోపం ఎక్కువ అని, అప్పడప్పుడు సినిమా షూటింగ్ ల దగ్గర ప్రదర్శిస్థుంటాడని కూడా చెప్పుకుంటుంటారు.

ఇప్పడు కూడా అలాంటి కోపమే వచ్చి కోర్టుదాకా వెల్లేందుకు కారణమవుతోంది అంటున్నారు. మంచు మనోజ్ తీస్థున్న ‘పోటుగాడు’ టీజర్ ను ఆదిత్యఆడియో మ్యూసిక్ వారు పైరసీ చేసారని తెలిసిందట.  ఈపైరసీ బయట విడుదలయిందని కూడా అంటున్నారట. అందుకే మనోజ్ ఈవిషయంలో కోర్టుకు వెల్లేందుకు సిద్దమవుతున్నాడు అంటున్నారు.

పోటుగాడు కన్నడలోని ‘గోవిందయా నమ:’ సినిమా రీమేక్. పవన్ డైరెక్షన్  చేస్థుండగా లగడపాటి శ్రీధర్ నిర్మాత. అయితే ఈ గొడవ కోర్టుదాకా వెల్లకుండా ఉండేందుకు, మనోజ్ ను చల్లబరచే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: