మ‌ల్టీప్లెక్స్‌ల కాలమిది. మ‌రి ఇప్పుడు  కొత్తగా టూరింగ్ టాకీస్ పెట్టడం ఏమిటి అంటారా?  మీ సందేహం  స‌రైన‌దే. అయితే పూరి జ‌గ‌న్నాథ్ కొత్తగా టాకీస్ క‌ట్టలేదు. త‌న నిర్మాణ సంస్థకు కొత్త పేరు నిర్ణయించాడు. పూరి టూరింగ్ టాకీస్ అనే సంస్థ పేరుతోనే ఇక‌పై సినిమాలు తీస్తాడు. ఇదివ‌ర‌కు ఆయ‌నకు వైష్ణో అకాడెమీ అనే బ్యాన‌ర్ ఉండేది. ఆ బ్యాన‌ర్ కాద‌ని... ఇప్పుడు పూరి టూరింగ్ టాకీస్ పేరుతో కొత్త బ్యాన‌ర్‌ని ఏర్పాటు చేశారు.

నితిన్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కించ‌నున్న `హార్ట్ ఎటాక్‌` సినిమా కొత్త సంస్థ ద్వారానే తీస్తున్నారు. ఈ నెలాఖ‌రున స్పెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఇందులో నితిన్ స‌ర‌స‌న ఆదాశ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. 

పూరి జ‌గ‌న్నాథ్ త‌న కొత్త సంస్థ గురించి చెబుతూ... `నా చిన్నప్పుడు పూరి టూరింగ్ టాకీస్ పేరుతో ఓ థియేట‌ర్ ఉండేది.  అందులోనే నేను సినిమాలు చూసేవాడిని.

ఇప్పుడు అదే నా సంస్థకు పేరు కావ‌డం విభిన్నమైన అనుభ‌వాన్నిస్తోంది` అన్నారు. వైష్ణో అకాడెమీ సంస్థ పూరి జ‌గ‌న్నాథ్‌కి అంత‌గా అచ్చిరాలేదు. ఆ సంస్థ ద్వారా వ‌చ్చిన సినిమాలు చాలా వ‌ర‌కు ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు త‌న సంస్థకు పేరు మార్చార‌ని అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: