వెండి తెరపై కనిపించినట్లుగా సినిమా సేలేబ్రెటీల జీవితాలు ఉండవు. వారివారి వ్యక్తిత్వం సంస్కారం బట్టి వారి అలవాట్లు ఉంటాయి. కానీ సామాన్య జనానికి మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన కుటుంబ సభ్యులతో బ్యాంకాక్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ ఆనందంలో ప్రకాష్ రాజ్ కు ఒక అనుకోని అతిధి తగిలాడు అతడే పూరిజగన్నాద్. పూరీకి ప్రకాష్ రాజ్ కు మధ్యన ఉన్న అవినాభావ సంబందం అందరికీ తెలిసిందే.

విలాసవంతమైన బ్యాంకాక్ బీచ్ ల మధ్య మన ప్రకాష్ రాజ్ తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా కధను పూరీకి వినిపిస్తూ అతడి సలహాలను తీసుకుంటూ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి ‘మీరు ఏమిచేస్తున్నారో నాకు తెలుసు’ అంటూ ట్విట్ పెట్టింది. బ్యాంకాక్ అంటేనే రకరకాల విదేశీ హాట్ డ్రింక్స్ కు, ధాయ్ మసాజ్ లకు పేరున్న ప్రాంతం కాబట్టి ఈ రెండు స్పాట్స్ లో ఎక్కడో అక్కడ వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారని లక్ష్మీ మంచు ఉద్దేశ్యం కాబోలు. ఇంతకీ లక్ష్మి మంచుకు వీరిద్దరూ అక్కడే ఉన్నారని ఆమెకెలా తెలుసో మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: