నార్త్ నుంచి వ‌చ్చింది పాప సున్నితంగా ఉంటుంది లే... అంటూ మ‌న తెలుగు ద‌ర్శక‌నిర్మాత‌లు చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేసేవారు. అమ్మడు ఏం చేయ‌గ‌ల‌దో అదే చేయించుకొనేవారు. పైగా మ‌న‌కు క‌థానాయిక‌ల కొర‌తాయే. అందుకే ఇలియానా తెలుగులో ఆడిందే ఆట పాడిందే పాట‌. షాట్ మ‌ధ్యలో ఉండ‌గానే వెళ్లి కేర్ వ్యాన్‌లో కూర్చునేదట‌. చెప్పాపెట్టకుండా షూటింగ్ నుంచి వెళ్లిపోయేది. అయినా భ‌రించారు. కోట్లకి కోట్లు ఇచ్చి మ‌రీ మ‌ర్యాద‌లు చేసేవారు.

అయితే ఈ ముద్దుగుమ్మ ఆటలు బాలీవుడ్‌లో మాత్రం సాగ‌డం లేదు. అబ్బా మంట అంటున్నా... త‌ట్టుకోవాల్సిందే అని ద‌ర్శకులు చెబుతున్నార‌ట‌.  బాలీవుడ్ మోజులో అమ్మడు త‌న పొగ‌రునంతా త‌గ్గించుకొని మ‌రీ న‌టిస్తోంద‌ట‌.

విష‌య‌మేమిటంటే... షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా హిందీలో `ఫ‌టా పోస్టర్ నిక‌లా హీరో` అనే చిత్రం తెర‌కెక్కుతోంది. అందులో ఇలియానా క‌థానాయిక‌. ఈ సినిమాలో ఫైట్లు చాలా ఉన్నాయ‌ట‌.

ఆ ఫైట్లలో క‌థానాయ‌కుడితో పాటు క‌థానాయిక కూడా పాల్గొనాల్సి వ‌చ్చింద‌ట‌. అప్పుడు ఇలియానా మామూలుగా కంగారుప‌డిపోలేద‌ట‌. ఫైట్ స‌న్నివేశాల్లో భాగంగా షాహిద్ క‌పూర్ అలా ముట్టుకొన్నా... అబ్బా మంట అనేద‌ట‌. దీంతో మ‌నోడు తెగ కోప్పడ్డాడ‌ట‌. మ‌రీ ఇంత సున్నిత‌మా? అని తిట్టాడ‌ట‌. 
ఇలియానా మాత్రం... ``ఒక‌సారి నా చ‌ర్మం ప‌ట్టుకొని చూడండి. అస‌లు ఎలా కందిపోతుందో. మీరు సున్నితంగా వ్యవ‌హ‌రించాల్సిందే`` అని చెబుతూ ఆచి తూచి ఆ స‌న్నివేశాలు చేసింద‌ట‌. అమ్మడి వాలకం చూసి చిత్రబృందం తెగ న‌వ్వుకొంద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: