హీరో అల్లు అర్జున్ ఒక లేటెస్ట్ గేమ్ కనిపెట్టాడు .అది ఏమిటంటే ఎవ‌రు  హిట్టు కొడితే వాళ్లను అభినందిస్తూ `నీతో ఓ సినిమా చేస్తా` అని ప్రామిస్ చేస్తూ  అటాడటం. ప్రస్తుతం బన్నీ ఈ అట ముగ్గురు యువ దర్శకులతో ఆడుతున్నాడు .ఇప్పుడు ఆ ముగ్గురు దర్శకులు ఎవరో చూద్దాం. ‘స్వామి రారా’ సినిమా చూసాక ఆ సినిమా చాల బాగా చేశావు మన ఇద్దరం ఓ సినిమా చేద్దాం అంటూ దైరెక్టర్ సుధీర్ వర్మకు ప్రామిస్ చేసాడట బన్నీ. దానితో ఆనంద పడిపోయిన సుధీర్ వర్మ ఒక కధను తాయారు చేసుకుంటూ ఉండే లోపునే బన్నీ ‘బలుపు’ సినిమాను చూసి గోపీచంద్ మల్లినేనికి ఇదే మాట చెప్పాడట.

ఆ మాటతో గోపీచంద్ కూడా బన్నీతో సినిమా అంటూ కలలు కంటూ ఉండగానే ఈ మధ్యనే విడుదల అయిన ‘భాయ్’ టీజర్ ను చూసి దర్శకుడు వీరభద్రం చౌదరికి ఫోన్ చేసి బన్నీ అతడి పై మనసు పడేసుకున్నాను అని చెప్పాడట. ఈ మాటలుతో ఐస్ అయిపోయిన వీరభద్రం బన్నీ కోసం మరోకధను సిద్దం చేసి బన్నీ ఎప్పుడు కొబ్బరికాయకు రెడీ అంటాడా అని ఎదురు చూస్తున్నాడట. కధలు పూర్తి చేసి ఈ ముగ్గురు డైరెక్టర్స్ బన్నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే బన్నీ మాత్రం వీరేవ్వరికీ దొరకకుండా ‘రేసు గుర్రం’ పై ఉన్నాడట..దటీజ్ బన్నీ లేటెస్ట్ గేమ్...

 

మరింత సమాచారం తెలుసుకోండి: