దేశం రకరకాల ఏర్పాటు ఉద్యమాలతో అశాంతి తో రగిలి పోతు ఉంటే, విదేశాలలో మన భారతీయులు మాత్రం మన దేశం బాగుండాలని మన సంస్కృతి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన దేశానికీ సంబంధించిన ఏ పండుగ నైనా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అవినీతి పై ఉద్యమం చేస్తున్న ఒక ప్రముఖ స్వాతంత్ర యోధుడు సినిమాలలో ఎంత డర్టీ హీరోయిన్ అయినా బయటకు వస్తే చాలు అత్యంత గౌరవ ప్రధంగా కనిపించే ఒక ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ పాల్గొని ఈ ఉత్సవాలకు గ్లామర్ తీసుకువచ్చారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం భారత స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు న్యూయార్క్ వీధులు భారతీయ జెండాల రెపరెపలతో నిండిపోయాయి.

అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే, బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఈ పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి సమక్షంలో వందల మంది పరేడ్ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్వర్యంలో నిర్వహించారు.  పరేడ్ జరుగుతుండగా రోడ్డుకు ఇరువైపులా నిలబడి త్రివర్ణ పతాకాలు చేతబూనిన ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేలాది మంది ఆడుతూ పాడుతూ డ్రమ్ములు వాయిస్తూ, కొంతమంది అయితే ఢోలక్ వంటి భారతీయ వాయిద్యాలు కూడా వాయిస్తూ పాల్గొన్నారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో గీసిన లైన్లమీద నిలబడిన వేలాది మంది భారతీయ అమెరికన్లు 'అయామ్ అన్నా' అని రాసి ఉన్న టోపీలు ధరించారు.

అవినీతి వ్యతిరేక ఉద్యమ సారధి అన్నా హజారే తో డర్టీ సినిమాలు చేసే విధ్యాబలన్ తన సినిమాల ఇమేజ్ కు భిన్నంగా దేశ భక్తిని ప్రభోధించే కార్యక్రమాలో పాల్గొనటం ద్వారా తన రియల్ లైఫ్ జీవిత ఉద్దేశ్యాలకు తన రీల్ లైఫ్ ఇమేజ్ ఎటువంటి ప్రతిబందకముకాదని విద్య నిరూపించింది. కోట్ల సంపాదన గురించే కాకుండా అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలలో మన సినీ గ్లామర్ బ్యూటీలు పాల్గొంటే బాగుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: